Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అకాల వర్షం అపార నష్టం..

 Damage to Mango Gardens for premature rains

వందల హెక్టార్లలో పండ్ల తోటలకు నష్టం
గద్వాల,నాగర్‌కర్నూల్,
వనపర్తి జిల్లాల్లో భారీ నష్టం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు
కోట్లాది రూపాయల నష్టం

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షాల దెబ్బకు వందల హెక్టార్ల పండ్ల తోటలు దెబ్బతిని ఉద్యాన రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిని కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జోగులంబ గద్వాల,వనపర్తి,నాగర్‌కర్నూల్ జిల్లాలో అపారనష్టం వాటిల్లినట్లు అదికారుల రికార్డులు తెలుపుతున్నాయి. జోగులంబ గద్వాల జిల్లాలో 286 హెక్టార్లలో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. అలాగే వనపర్తి జిల్లాలో 392 హెక్టార్లలో,నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో 200 హెక్టార్లు,మహబూబ్‌నగర్ జిల్లాలో 40హెక్టార్లలో పండ్లతోటలు నష్టం వాటిల్లింది. ఇలా నాలుగు జిల్లాల పరిధిలో రైతులకు రూ.3కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దీంతో ఎంతో కష్టపడి సాగుచేసిన పండ్లతోటలు అకాల వర్షంతో కోలుకోలేని దెబ్బతగిలి రైతులు విలవిలలాడుతున్నారు. దీంతో వెంటనే తమకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ ప్రతినిధి : గురువారం కురిసిన అకాల వర్షాలకు ఎక్కువ మామిడితోటలకు నష్టం వాటిలినట్లు అధికారులు అంచనాలను సిద్దం చేశారు. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడితోటలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సాధారణంగా ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్,గద్వాల,వనపర్తి ప్రాంతాలల్లో మామిడితోటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇలా సాగు చేసిన తోటలకు అకాల వర్షాలు రావడంతో రైతులకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతూ వస్తోంది. ఇలా గద్వాల జిల్లాలో 286 హెక్టార్ల పండ్ల తోటలకు నష్టం వాటిల్లగా అందులో అత్యధిక భాగం 218 హెక్టార్లలో మామిడి పంట లకు నష్టం వాటిల్లింది. అలాగే మరో 4హెక్టార్లలో బొప్పాయి,07హెక్టార్లలో మున గ,12హె క్టార్లలో అరటి తోట,తదిత పంట్లతోటలకు నష్టం వాటిల్లి దాదాపు రూ.1.50కోట్ల నష్టం వా టిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వనపర్తి జిల్లాలో 392 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతినట్లు అధికారులు గుర్తించారు. అందులో 261 హెక్టాలలో మామిడి పం టలకు నష్టం వాటిల్లింది. ఇలా వనపర్తి జిల్లాలో వనపర్తితోపాటు వీపనగండ్ల,చిన్నంబావి,పా న్‌గల్,పెబ్బెరు,గోపాల్‌పేట మండలాల్లో అత్యధికంగా పండ్లతోటలకు నష్టం ఏర్పాడింది. అ లాగే నాగర్‌కర్నూల్ జిల్లాలో 200హెక్టార్లకుపైగా పండ్లతోటలకు నష్టం వాటిల్లింది. దీం తోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో 40హెక్టార్లలో పండ్లతోటలకు నష్టం వాటిల్లింది. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 700లకుపైగా హెక్టార్లలో పండ్లతోటలకు నష్టం వచ్చి రైతులకు రూ.3కోట్లకుపైగా నష్టం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
చేతికి వచ్చే సమయంలో…. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడితోటల దిగుబడి ఇప్పుడిప్పు డే ప్రారంభం అవుతోంది. ఇలా దిగుబడి ప్రారంభమై పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు వచ్చి నష్టాన్ని మిగిల్చడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. మామిడి పండ్ల దిగుబడులు చేతికి వచ్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే సమయంలో అకాల వర్షాలు వచ్చి మామిడి పళ్లు నేల రాలడంతో రైతులకు, కౌలుకు తోటలను తీసుకున్న రైతులకు నష్టా న్ని మిగిల్చింది. దీంతో తమను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుని నష్టపరిహారాన్ని అందిం చాలని రైతులు కోరుతున్నారు.
నీట మునిగిన వరి ధాన్యం… ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షాని కి వరిధాన్యం నీటమునిగి రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్‌యార్డులకు తరలించిన ధాన్యంతోపాటు,కల్లాల్లో ఉంచిన ధాన్యం కుప్పలు నీటమునిగి రైతులకు నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్‌తోపాటు జడ్చర్ల,గద్వాల,వనపర్తి ప్రాంతాలల్లో వరి ధాన్యం నీటమునిగి రైతులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచన వేసే పనిలో పడ్డారు.

Comments

comments