Search
Saturday 21 July 2018
  • :
  • :

న్యాయం చేస్తాం : కలెక్టర్

 Damages to farmers who lost land in Vikarabad District

మనతెలంగాణ/తాండూరు టౌన్: దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, రైల్వే ట్రాక్‌లో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, కార్మికులకు కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిట్టినాడు రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చే యాలని డిమాండ్ చేశారు. చంద్రవంచ గ్రామంలో అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమిని అందించాలని, భూ పంపిణీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని వారు కోరారు. ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అందించాలని, జిల్లా ఆసుపత్రిలో  అక్రమంగా నియమించిన 16మంది కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టర్‌పై విచారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు  దిగారు.ఇ ందుకు స్పందించిన  జిల్లా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ ధర్నాకు దిగిన ఆందోళన కారుల వద్దకు వచ్చి మీ సమస్యలపై తగు విచారణ చేపట్టి అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మీరు కోరిన డిమాండ్‌లపై ఆర్‌డిఒ వేణుమాధవరావుతో విచారణ చేపట్టి తగు న్యాయం చేస్తామని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఎఫ్ తాండూరు నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, చంద్రవంచ,మల్కాపూర్, మిట్టా బాసుపల్లి, సంఘకాలన్ తదితర గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు.

Comments

comments