Search
Wednesday 14 November 2018
  • :
  • :

22న ‘దమ్ముంటే సొమ్మేరా’

film

సంతానం, అంచల్ సింగ్ హీరోహీరోయిన్లుగా శ్రీ తెన్నాండళ్ ఫిలింస్ బ్యానర్‌పై రాంబాల దర్శకత్వంలో రూపొందిన తమిళ్ చిత్రం ‘దిల్లుడు దుడ్డు’. ఈ  చిత్రాన్ని శ్రీకృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్‌తో తెలుగులోకి అనువదించి విడుదల చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసు కొని ఈ చిత్రం ఈనెల 22న విడుదలకానుంది. ఈ సందర్భం గా హైదరాబాద్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు  పసు పులేటి రామారావు మాట్లాడుతూ “తమిళ్ హాస్యనటుడు సంతానం ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన గత సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అతను హీరోగా చేస్తున్న  సినిమాపై మంచి అంచనాలున్నాయి”అని అన్నారు. శ్రీకృష్ణా ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ “తమిళంలో తెన్నాండాల్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్‌తో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్‌లో విడుదలవుతున్న తొలి సినిమా ఇది”అని తెలిపారు. శాన్య, కరుణాస్, శురభ్, ఆనంద్ రాజ్, శోభా మనోహర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః దీపక్ కుమార్ పతి, సంగీతంః తమన్, పాటలుః మదన్, కార్కీ, ఎడిటింగ్‌ః  గోపీకృష్ణ, ఆర్ట్‌ః ఏ.ఆర్.మోహన్, యాక్షన్‌ః హరి దినేష్.

Comments

comments