Search
Sunday 23 September 2018
  • :
  • :

దామోదర్ మనసు మార్చవా మహాత్మా!

medakసిద్దిపేట : భారత దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీలో అప్రజాస్వామిక వాదులు పెరిగి పోయారని వారికి సద్భుద్ది కల్పించాలని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి సిద్దిపేటకు చెందిన జర్నలిస్టులు వినతిపత్రం అందించారు. తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో గత కొద్ది రోజుల క్రితం విలేకరులను ఇష్టారీతిగా భూతులు మాట్లాడి, కార్యకర్తలను రెచ్చగొట్టి విలేఖరుల మీద దాడికి పురికొల్పిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మా వైఖరికి నిరసగా పాత బస్టాండ్ వద్ద టియూడబ్లుజె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు కలకుంట్ల రంగాచారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు లోక రవిచంద్ర ఆధ్వర్యంలో విలేకరులు పాత బస్టాండ్ వద్ద దామోదర్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని గాలికొదిలి, ప్రజలను పట్టించుకోక అధికారంకు దూరమైన వారు నేటికీ జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, స్వర్గంలో ఉన్న నీవైన వారికి సద్బుద్ది ప్రసాదించాలని లేఖలో కోరారు. కార్యక్రమంలో విలేఖరులు కొమురవెల్లి అంజయ్య, కత్తుల శ్రీనివాస్‌రెడ్డి,దాస శ్రీనివాస్, పాండు, సంజీవరెడ్డి, సిద్దయ్య, రఘు, మురళి, కర్ణాకర్‌రెడ్డి, చంద్రమౌళి,యాదవరెడ్డి, రమణాచారి,మజ్జు, క్రిష్ణ, జనార్ధన్, స్వామి, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments