Search
Thursday 18 October 2018
  • :
  • :

బిజెపిలో చేరిన దామోదర రాజనర్సింహ సతీమణి

Damodara Raja Narasimha Wife Padmini Reddy Join in BJP

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి గురువారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, తెలంగాణ బిజెపి శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోడీపై ఉన్న అభిమానంతోనే తాను బిజెపిలో చేరినట్టు పద్మినీరెడ్డి తెలిపారు. పేద ప్రజల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. తనకు సంగారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశాన్ని బిజెపి అధిష్ఠానం ఇస్తే, గెలిచి తీరుతానని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆందోల్ సీటును దామోదర రాజనర్సింహకు కేటాయించింది. దీంతో సంగారెడ్డి లేదా మెదక్ నుంచి పోటీ చేయాలని భావించిన పద్మినీరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పద్మినీరెడ్డి బిజెపిలో చేరినట్టు సమాచారం.

Damodara Raja Narasimha Wife Padmini Reddy Join in BJP

Comments

comments