Home Elections 2018 కాంగ్రెస్‌లో బిసిలకు అన్యాయం : దానం నాగేందర్

కాంగ్రెస్‌లో బిసిలకు అన్యాయం : దానం నాగేందర్

Danam Nagender Comments on Congress

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో బిసిలకు తీరని అన్యాయం జరిగిందని మాజీ మంత్రి , టిఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో బిసిలకు జరుగుతున్న అన్యాయంపై తాను మొదటి నుంచి మాట్లాడుతున్నానని ఆయన తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బిజెపి నేతలు, కార్యకర్తలు దానం సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖైతరాబాద్ స్థానాన్ని ఎవరికి కేటాయించినా, కలిసి పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పదవులు ఆశించి టిఆర్‌ఎస్‌లో చేరలేదని, పార్టీ కార్యకర్తగా పని చేస్తానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందిన ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్‌ఎస్‌కు మద్ధతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. అధికార దాహంతో ఓట్ల కోసం వస్తున్న మహాకూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Danam Nagender Comments on Congress