Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మంత్రి తలసానితో దానం నాగేందర్ కీలక భేటీ

talasani

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్ శుక్రవారం సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఆదర్శ్ నగర్‌లోని న్యూ ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో తలసానిని కలిసి పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా భేటీ అనంతరం దానం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ భేటీపై మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. అన్నీ విషయాలు రేపు(శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు ఫిలింనగర్‌లోని ఫిల్మ్-ఎ జంక్షన్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి దానం నాగేందర్ వెల్లడిస్తారని అయన చెప్పారు. టిఆర్‌ఎస్‌లోకి ఎవరొచ్చినా సరే వందశాతం ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా తలసాని పేర్కొన్నారు

Comments

comments