Home తాజా వార్తలు కాంగ్రెస్‌కు దానం రాజీనామా!

కాంగ్రెస్‌కు దానం రాజీనామా!

Danam Nagender resigns to Congress

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దానం నాగేందర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి దానం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు పంపారు. కాగా, భవిష్యత్ కార్యాచరణను దానం శనివారం ప్రకటించనున్నారని సమాచారం. ఇదిలాఉండగా దానం త్వరలో కారు ఎక్కబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.