Home హైదరాబాద్ దానం ఎటు వైపు!

దానం ఎటు వైపు!

తెల్చేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాం
నేడు గాంధీభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశం ?
సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి లేఖ

Danamమన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ కాంగ్రెస్ రాజకీ యాలు రసవత్తరంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు దానం నాగేందర్‌ను ఇరకాటంలో పేట్టేందుకు కాంగ్రెస్ నగర నేతలు వ్వూహాలు సిద్ధం చేస్తున్నారు. చేస్తున్నారు. అసలు ఆయన కాంగ్రెస్సా, టిఆర్‌ఎస్సా అని తెల్చేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా దానం నాగేందర్ ఇంటికీ వెళ్లడమే కాకుండా గంటపాటు అంతర్గత చర్చలు కొనసాగించిన విషయం తెలిసిందే. దీంతో దానం కారేక్కనున్నారని పుకార్లు షికార్లు చేయడంతో ఆయన వెంటనే అదేమి లేదంటూ ప్రకటనలు జారీ చేసి అప్పటికప్పుడు సర్ధి చెప్పుతూ తనదైన స్టైల్‌లో దానం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దానం మరింతగా ఇటు గ్రేటర్ , అటు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలపై అవకాశం దొరికితే చాలు వాగ్వివాదాలకు దిగడం, ఎవరితోనూ సఖ్యతగా ఉండకపోవడం కూడా ఇటీవల కాలంలో అధికమైందేని ఆపార్టీ నేతలు బహి రంగంగానే పేర్కొంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాక సందర్భంగా శంషా బాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే రంగారెడ్డి జిల్లాలోని పరిగి ఎమ్మె ల్యే రాంమోహన్‌రెడ్డితో ఘర్షణకు కావాలనే దిగడం ఇం దుకు బలం చేకూరుతున్నాయి. కాంగ్రెస్ పార్టే స్వయంగా తనను బహిష్కరించే విధంగా దానం తన వ్యవహార శైలిని నడుపుతున్నారని పలువురు సిటీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హఠా త్తుగా ఎక్సైజ్ శాఖ మంత్రి కె.పద్మారావు మంగళవారం స్వయంగా దానం నాగేందర్ ఇంటికి వెళ్లడంతో కాంగ్రెస్ వర్గాలు ఒక్కసారిగా అవాక్కుకయ్యాయి. దీంతో అసలు దానం ఏ పక్షం అనేది తెల్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సైతం నడుం బిగించింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ వెంటనే గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ సమావే శం గురువారం ఏర్పాటు చేయాలని, తాను సైతం పాల్గొంటానన్ని బుధవారం వర్తమానం పంపడ ంతో కాంగ్రెస్ నేతల్లో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసు కుంది. అయితే దానం వైరి పక్షం ఈ సమావేశంతో ఏదో ఒక్కటి తేలిపోతుందని ఆనంద పడుతుండగా, దానం వర్గం ఏవిధంగా స్పందిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెల కొంది.
దానం సమావేశం పెట్టు
మర్రిశశిధర్ రెడ్డి
సిటీ కాంగ్రెస్ సమావేశం గురువారం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు దానం నాగేందర్‌కు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. దానంను మంత్రి పద్మరావును స్వయంగా ఇంటికి వెళ్లి కలవడంతో సిటీ కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ఇక మౌనం వహిస్తే పార్టీతో పాటు తమకు కూడా వ్యక్తిగతంగా నష్టమనే భావనలో సిటీ నేతలు ఉన్నారు. తాము పార్టీకీ సంవత్సరాల పాటు సేవలందిస్తున్నా దానం మాత్రమే పెత్తనం చెలాయిస్తూ, అటు పార్టీకీ, ఇటు తమకు నష్టం చేకూర్చుతున్నారని పలువురు సీనియర్ నేతలు ఇప్పటీకే పార్టీ సమావేశాలల్లో బహిరంగంగానే పేర్కొన్నారు. అయితే తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక ఖాయం కావడంతో అంతలోపు పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని ఆ నియోకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మర్రి శశిధర్‌రెడ్డి భావిస్తున్నారు.
అందుకే దానంతో అమీ తూమీ తెల్చుకునే ందుకు ఆయన తాజాగా లేఖాస్త్రం సంధించారు. సీటీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ దానంను లేఖలో కోరారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలం, బలహీనతలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులను ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఆయన దానంను కోరారు.