Search
Wednesday 21 November 2018
  • :
  • :

‘ విశ్వాసం ’ సెట్‌లో గుండెపోటుతో డ్యాన్సర్ మృతి

Dancer died with Heart Attack

పుణె : ప్రముఖ తమిళ హీరో అజిత్ నటిస్తున్న ‘ విశ్వాసం ’సెట్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. ఓ పాట కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో శరవణన్ అనే డ్యాన్సర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో తక్షణమే శరవణన్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అదే ఆస్పత్రిలో శరవణన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై అజిత్ విచారం వ్యక్తం చేశారు. శరవణన్ మృతదేహాన్ని చెన్నయ్‌కి తరలించేందుకు అజిత్ అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు శరవణన్ కుటుంబానికి అజిత్ రూ.8లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. కొంతకాలంగా శరవణన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌కు చెప్పలేదని సహ డ్యాన్సర్లు చెప్పారు. శరణవన్ కుటుంబానికి అజిత్, చిత్ర యూనిట్ సానుభూతి తెలిపారు.

Dancer died with Heart Attack

Comments

comments