Home ఆఫ్ బీట్ డేంజర్ జంక్షన్లు

డేంజర్ జంక్షన్లు

Warangal-National-High-Way

మన తెలంగాణ/బోడుప్పల్: వరంగల్ జాతీయ రహదా రిలో ని కొన్ని చౌరస్తాలు మరియూ మలుపులు యాక్సిడెంట్ స్పాట్ల్ గా మారుతున్నాయి. కొన్ని జంక్షన్లు, బ్రిడ్జి లు, మూల మలుపులు ప్రధాన ఘంటికలు మోగిస్తున్నా యి. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. అనేక మందిని ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. గుంతలమ యం అయిన రోడ్లు, రక్షణ లేని సిగ్నల్స్ జనా ల ఆయువును తీస్తున్నాయి, వరంగల్ జాతీయ రహదారి ఫీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని కమాన్ నుండి బో డుప్పల్ కమాన్, ఉప్పల్ డిపో, కేనార నగర్ బస్టాప్, మే డిపల్లి పిఎస్ చౌరస్తా, మేడిపల్లి విలేజ్ రోడ్డు, చెంగిచెర్ల చౌరస్తా, నారపల్లి మలుపు వంటి ప్రాంతాల్లో ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ లేక పోవడంతో ఇక్కడి ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు : రాష్ట్ర రాజాధాని గ్రేటర్ హైదరాబాద్ కు ఆనుకోని ఉన్న నగర శివారు మున్సిపాలిటిలైన బోడుప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాలు శర వేగంగా అభివృ ద్ధి చెందుతుండడంతో ఇక్కడి ప్రాంతాల్లో జన సంచారం ఎక్కువైందని చెప్పవచ్చు. అందులోనూ వరంగల్ జా తీయ రహదారి భువనగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు ఉండడంతో నిత్యం హైదరాబాద్ కు వేలాది వాహనాలు వస్తూ పోతుంటాయి. దానికి తోడు శివారు ప్రాంతాల్లో రోజు రోజుకు విస్తరిస్తున్న వ్యాపార సముదాయా లు, హాస్పటిల్స్, విద్యాసంస్థలు, ఫర్నిచర్ మాల్స్ ఉండడంతో వాటి ఆవసరాల నిమిత్తం వచ్చి పోయే వారు తొందర గా వెళ్లాలనే ఆలోచన కొంత మంది ఎందుకులే అని కొం త మంది రాంగ్ రూట్లో వెళ్లడం కూడా ప్రమాదాలకు కా రణం అవుతున్నాయి అని చెప్పవచ్చు ఇక్కడి ప్రాం తాల్లో టాఫ్రిక్ నియంత్రణ లేని కారణంగా నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

మచ్చుకు కొన్ని: ఘట్‌కేసర్ మండలం పడమటి సాయి గూడెంకు చెందిన సీహెచ్ నాగరాజు (20) తన చెల్లి వ సంతను ఇంటర్ పరీక్ష రాయించేందుకు స్నేహితుడు, బాలుతో కలిసి ద్విచక్రవాహనంపై ఘట్‌కేసర్ నుంచి నా రపల్లిలోని నల్ల మల్లారెడ్డి కళాశాలకు బయలుదేరారు. నారపల్లి హెచ్‌పి పెట్రోల్ బం క్ వద్దకు రాగానే బంక్‌లో డీజిల్ పోసుకుని బొలేరో వ్యాన్ యూ టర్న్ తీసుకుం టూ భైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అ చౌరస్తా వద్ద సిగ్న ల్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. మరో ఘటనలో ఛౌదరిగూ డా వెంకటాధ్రి టౌన్ షిప్‌కు చెందిన అందే శ్రీనివాస్ (4౩) ఈ నెల 21న సికింద్రాబాద్ నుండి తన ఇంటికి వెళ్తుండగా సిగ్నల్ లేని కారణంగా మేడిపల్లి సీపీఆర్‌ఐ చౌరస్తాలో బైక్ అదుపుతప్పి కింద పడి మృతి చెందాడు.

నిత్యం రద్దీగా ఉండే వరంగల్ జాతీ యా రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణలు లేని కారణంగా ని త్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎఐఎస్‌ఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.