Home హైదరాబాద్ ‘యాంటిబయాటిక్స్’తో డేంజర్

‘యాంటిబయాటిక్స్’తో డేంజర్

Tablets

అవసరం లేకున్నా యథేచ్ఛగా మందుల వాడకం అతిగా వాడితే ప్రమాదమంటున్న వైద్యులు

హైదరాబాద్: ఏదైనా వాడాల్సిన దానికంటే అతిగా వాడితే ప్రమాదమే. యాంటిబయాటిక్స్ మాత్రలు అతి గా వాడటం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడేఅవకాశముంది. తలనొప్పి, జలుబు, జ్వరం ఇలా ఏ చిన్న వ్యాధి వచ్చిన వెంటనే మాత్రలు మింగుతుంటే అనారోగ్యం బారిన పడినట్లే. అవసరం ఉన్నా,లేకున్నా ప్రతి దానికి మందులు తీసుకుంటే ఆరోగ్యం డేంజర్లో ఉన్నట్లేనని వైద్యులు సూచిస్తున్నారు. జబ్బుకు కారణాలు పట్టించుకోకుం డా త్వరగా ఉపశమనం కోసం యాంటిబయాటిక్స్ మాత్రలు వాడటం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అతిగా యాంటి బయాటిక్స్ తీసుకోవడంతో మనపై దాడి చేసే బ్యాక్టీరియా, వైరస్‌లు మరింత బలపడి అవి మొండిగా మారుతాయి. దీంతో వ్యాధి తగ్గకపోగా మన శరీరంలో సహజమైన వ్యాధి నిరోధక శక్తి(రెసిస్టెన్సీ పవర్) తగ్గిపోతుంది. దీని కారణంగా తరుచూ వ్యాధులపాలవుతారు. శరీరంలోని ఒక్కొక్క వ్యవస్థను ఆ బ్యాక్టీరియా నాశనం చేస్తుందని ఒక పరిశోధనలో కూడా వెల్లడైంది. ఇప్పటికే ఈ మొండి బ్యా క్టీరియా బారిన పడి దేశంలో ప్రతి ఏటా దాదాపు 7లక్షల మం ది మృత్యువాతపడుతున్నారు.

గత కొన్నేళ్లుగా అమెరికాలో దాదా పు 2లక్షల మంది ఆ బ్యాక్టీరియా కారణంగా చనిపోయినట్లు తెలిసింది. ఈ బ్యాక్టీరియాను నియంత్రించకపోతే 2050 నా టికి ప్రతి సంవత్సరం దాదాపు కోటి మంది జనం చనిపోవచ్చ ని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరణాలకు కారణమవుతోన్న ఈ మొండి బ్యాక్టీరియాను ఎదురుకోవడానికి ప్ర పంచ వైద్యుల బృందం పరిశోధనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి జబ్బుకు ఔషధంగా భావించే యాంటిబయాటిక్స్ కోసం డాక్టర్లు డిమాండ్ చేయొద్దని పరిశోధకులు సూచిస్తున్నా రు. జబ్బుకు తగ్గ మందులను మాత్రమే రోగులు వాడేలా వై ద్యులు ప్రిస్కిప్షన్ రాయలే తప్ప అవసరం లేకున్నా డబ్బుల కో సం యాంటిబయాటిక్స్‌ను సూచించడంతో ప్రజలు సైడ్‌ఎఫెక్ట్‌లతో అనారోగ్యపాలవుతున్నారు. ఒక రోగి యాంటిబయాటిక్స్‌ను సక్రమంగా వాడినప్పుడు బ్యాక్టీరియా అంతమవుతోంది. అ యితే కొన్ని సందర్భాల్లో దీన్ని తట్టుకొని నిలదొక్కుకుంటుంది. మొండిగా మారిన బ్యాక్టీరియా యాంటిబయాటిక్స్ శక్తిని తట్టుకునే శక్తిని తన తర్వాతి తరాలకు అందిస్తుంది.

విటమిన్ మందులూ డేంజరే
విటమిన్ మందులతో సన్నగా, అందంగా ఉండవచ్చని మహిళలు, పరుషులు అనే తేడా లేకుండా వాడుతున్నారు. దీంతో విటమిన్ మందులు వాడుతున్నామన్న పేరుతో రెండు మూడు రోజులకొకసారి ఆహారం తీసుకుంటున్నారు. ఆహారం తీసుకున్న తరువాత మల్టీ విటమిన్ల మందులు తీసుకోవడం వల్ల శరీరానికి అందని విటమిన్లు అందుతాయి. అది కూడా 60 సంవత్సరాలపై బడిన వారికి మాత్రమే. యువత ఆహారం తీసుకోకుండా మందులు వాడటంతో శరీరానికి కావాల్సిన శక్తి అందటంలేదని, దీంతో నీరసించి వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో కొందరికి అన్న వాహికలో సమస్యలతో పాటు రక్త ప్రసరణ లోపం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో స్త్రీలలో రుతుక్రమ సమస్యలు, గర్భసంచిలో లోపాలు వచ్చి తల్లులు కాలేని దుస్థితి ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు. నేటి యువతలో కొందరు పబ్‌లకు అలవాటు పడి డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారు. వీరిలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని పలువురు చెబుతున్నారు.

వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి
సాధారణంగా చిన్నపాటి రోగాలకు నేరుగా మెడికల్ దుకాణాలకు వెళ్లి మందులను తీసుకొని వాడటం సహజంగా మారింది. ఇలా వాడుతుండటంతో ఆ ప్రభావం కిడ్నీలపై చూపుతోంది. కొన్ని రోజుల తరువాత కిడ్నీల్లో మంట, నొప్పి వస్తుంది. దీంతో వీరి కిడ్నీలు పని చేయడం నెమ్మదించి చెడి పోతున్నాయి. ఈ వ్యాధి బారిన పడినవారు, చెడి పోయిన కిడ్నీలు పనిచేయక పోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరువాత దవాఖానాలో చేరి డయాలసీస్ చేయించుకంటున్నారు. కాగా, కొన్ని కారణాలతో డయాలసిస్ చేయించుకునే వారిని అకాల మృత్యువు కబళిస్తుంది. దీంతో వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.