Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

జాతీయ రహదారిపై ప్రమాదకరంగా గొయ్యి

Dangerous Hole On  National highway Road In Jayashankar

గోవిందరావుపేట :గోవిందరావుపేట మండల పరిధి పస్రా 163వ జాతీయ రహదారి కింద మిషన్‌భగీరథ పైపులు వేసేందుకు తవ్వి పైపులు వేసి గొయ్యి సరిగా పూడ్చకపోవడంతో గొయ్యిపడింది. పైప్‌లైన్ కోసం తవ్విన వద్ద మట్టి సరిగ్గా పోయకపోవడంతో ప్రమాదపుటంచులపై అనునిత్యం ప్రయాణికులు ప్రయాణించక తప్పడం లేదు. అంతే కాకుండా జాతీయ రహదారుల శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడిందని పలువురు విమర్శలు మెండుగా ఉన్నాయి. పస్రా గ్రామంలోని జాతీయ రహదారి పక్కన వేసిన పైప్‌లైన్ గోతిలో లక్ష్మిక్లాత్‌స్టోర్స్ ఎదురుగా రాత్రి వేళ్లలో ఏటూరునాగారం నుండి వరంగల్ మార్కెట్ వెళ్ళే మిర్చిలారీ గోతిలో దిగబడడంతో గ్రామస్తుల సహకారంతో జెసిపితో దిగబడిన మిర్చిలోడ్ లారీ బయటకు తీయడం జరిగింది. అంతే కాకుండా జాతీయ రహదారి పక్క హైలెవల్ వాటర్‌ ట్యాంక్ ఎదురుగా గతంలో కూడా ఇదే ప్రాంతలో గొయ్యిపడి హన్మకొండ నుండి ఏటూరు నాగారం వైపు వెళ్ళు వారు గోతిలో పడి ప్రాణాపాయం తప్పింది. మళ్లి ఇదే ప్రాంతంలో గొయ్యిపడ్డప్పటికి జాతీయ రహదారుల అధికారులు నిర్లక్షానికి నిదర్శనమని చెప్పక తప్పదు. ఇప్పటికైన సంబంధిత అధికారులు చర్య తీసుకొని తక్షణమే జాతీయ రహదారి పక్క ఉన్న గుంతలు, గోతులు పూడ్చివేత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments