Home జగిత్యాల జగిత్యాలలో రోడ్ల విస్తరణ జరిగేనా!

జగిత్యాలలో రోడ్ల విస్తరణ జరిగేనా!

Dangers in the area of the day.. surviving in the air

ఇరుకు రోడ్లతో ఇబ్బందులు
రోజుకో ప్రాంతంలో ప్రమాదాలు.. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు
నడి రోడ్ల మీదే వ్యాపారాలు…వాహనాల పార్కింగ్‌లు
రాజకీయ ఒత్తిళ్లతోనే చర్యలకు అధికారుల వెనుకంజ..!

ఇరుకు ఇరుకు రోడ్లు…నడి రోడ్ల మీదే వ్యాపారాలు… వాహనాల పార్కింగ్‌లు. పేరుకు జాతీయ రహదారి అయినా అంతర్గత రోడ్డు కన్నా అధ్వాన్నమైన పరిస్థితి. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని దుస్థితి. ప్రమాదాల రూపంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయినా మారని అధికారుల తీరు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతమనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. జగిత్యాల జిల్లా కేంద్రం తీరిది… రోడ్ల విస్తరణ చేపట్టి సమస్య పరిష్కరించేందుకు అధికారులు ముందుకు రావడం… ఆ తర్వాత ఎందుకో కాని అధికారులు మిన్నకుండడంతో సమస్య సమస్యగానే మిగిలిపోతోంది. సోమవారం ఓ డిగ్రీ విద్యార్థి నడి రోడ్డుపై దుర్మరణం పాలు కాగా ఇరుకు రోడ్లతో ఇంకెన్ని ప్రాణాలు పోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో “మన తెలంగాణ” అందిస్తున్న కథనం..

మనతెలంగాణ/జగితాల : జిల్లా కేంద్రమైన జగిత్యాలలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. మారుమూల గ్రామాల్లో, మండల కేంద్రాల్లో రోడ్లు విశాలంగా ఉంటుండగా జగిత్యాలలో మాత్రం ఇరుకు రోడ్లతో ప్రజలకు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. జగిత్యాల పట్టణ జనాభా లక్షన్నరకు పైగా ఉం డగా జిల్లా కేంద్రమైన జగిత్యాలకు వివిధ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. 64వ నెంబర్ జాతీయ రహదా రి జగిత్యాల పట్టణంలో నుండే వెళ్లడంతో వందల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అసలే ఇరుకు రోడ్లు కాగా రోడ్ల మీదే వ్యాపారాలు, వాహనాల పార్కింగ్ చేయడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. రోడ్ల మీద ఎక్కడికక్కడ రాజకీయ నేతల అండదండలతో షెడ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహించడం… వాటి ముందు వాహనాలు పార్కింగ్ చేయడం తో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామంటూ కొందరు నెల నెలా వారి వద్ద ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ని నిజామాబాద్ రోడ్, కొత్తబస్టాండ్, యావర్‌రోడ్, పాత బస్టాండ్, రాంబజార్, టవర్ సర్కిల్, గంజ్ రోడ్, మార్కెట్ రోడ్, కస్తూరి స్ట్రీట్‌లో సమస్య మరీ తీవ్రం గా ఉంది. ఏ వాహనం ఎటు వైపు నుంచి వస్తుందో… ఎక్కడ ప్రమాదానికి గురవుతామో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో రోజుకో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాపార లావాదేవిలు ఎక్కువగా నడిచే టవర్ సర్కిల్ ప్రాంతానికి భారీ వాహనాలు అనుమతించడం వల్ల ఒక్కోసారి గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. భారీ వాహనాలు పట్టణంలోని రాకుండా ఉండేందుకు బైపాస్ రోడ్డు నిర్మించినా అటు వైపు వెళ్తున్న వాహనాలు ఒకటి రెండు మాత్రమే. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికార గణం…
అప్పట్లో ఓ విద్యార్థి పాఠశాలకు వెళ్తూ వాహనం కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఇరుకు రోడ్లు.. భారీ వాహనాల నియంత్రణ లేకపోవడం వల్లే చిన్నా రి ప్రాణం గాలిలో కలిసిపోయిందని… వెంటనే రోడ్ల విస్తరణ చేపట్టాలని పట్ట ణ వాసులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతిపత్రా లు సమర్పించా రు. దాంతో స్పందించిన అప్పటి సబ్ కలెక్టర్ శ్రీకే శ్ బి.లాఠ్కర్ రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్లకు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇరుకుగా ఉన్న రోడ్లను విస్తరణ చేపట్టేందుకు మార్కింగ్ చేసి భవన య జమానులకు నోటీసులు అందజేశారు. దాంతో రోడ్ల విస్తరణ జరిగి సమస్య తీరుతుందని పట్టణ ప్రజలు సంబరపడ్డారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ రోడ్ల మీది నుంచి తొలగించిన షెడ్లు మళ్లీ వెలిసాయి.. విస్తరణ పనుల ఊసే లేకుం డా పోయింది. తాజాగా సోమవారం పట్టణానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థి రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఇరుకు రోడ్లతోనే ప్ర మాదాలు జరుగుతూ విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్‌డిఓ చౌరస్తా వద్ద ధ ర్నా నిర్వహించి ఆర్‌డిఓకు వినతిపత్రం అందజేశారు. రాజకీయ నేతల ఒత్తిళ్ల వల్లే తరచూ పనులకు ఆటంకం ఏర్పడుతోందని, వారి ఒత్తిళ్లకు తలొగ్గి పనులు చేపట్టడంతో కొంత జాప్యం జరగడంతో ఒకరిద్దరూ న్యాయస్థానా న్ని ఆశ్రయించడం.. ఇప్పుడే కూల్చివేయవద్దంటూ స్టే తెచ్చుకోవడం జగిత్యాలలో పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరుకు రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించినా అతీగతీ లేకుండా పోయింది. పెరుగుతున్న జ నాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరిగినప్పుడే సమస్యలు ఉత్ఫ న్నం కావనే నగ్న సత్యాన్ని ఇటు భవన యజమానులు, అటు రాజకీయ నాయకులు గు ర్తించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.