Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ధనుష్, కీర్తి కాంబినేషన్‌లో ‘రైల్’

23రఘువరన్ బి.టెక్, అనేకుడు, మరియన్ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ చిత్రంతో హీరోయిన్‌గా మెరిసిన కీర్తి సురేష్ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రైల్’. ఆదిత్య మూవీ  కార్పొరేషన్, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్ పతాకాలపై బేబి రోహిత్ రజ్న సమర్పణలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లా డుతూ “హీరో ధనుష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘నేను శైలజ’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ కీర్తి సురే ష్. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రైల్’. ఈ చిత్రం ఆడియోను శనివారం విడుదల చేసి సినిమాను ఈనెల 16న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. తంబి రామయ్య, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీః వెట్రివేల్ మహేంద్రన్, ఎడిటింగ్‌ః ఎల్.వి.కె.దాస్, ఫైట్స్‌ః స్టన్ శివ, మాటలుః వెన్నెలకంటి, పాటలుః వెన్నెలకంటి, సాహితి.

Comments

comments