Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మణిరత్నం మూవీ బాలీవుడ్ రీమేక్‌లో ధనుష్

danushఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కించిన ‘రాంజానా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీనిచ్చాడు తమిళ్ స్టార్ హీరో ధనుష్. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లాడు ఈ కథానాయకుడు. ఆతర్వాత బిగ్-బి అమితాబ్‌తో కలిసి నటించిన ‘షమితాబ్’ సినిమాతో మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ధనుష్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకొని మరో సెన్సేషనల్ మూవీతో బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ధనుష్. మణిరత్నం ఆల్‌టైం క్లాసిక్ ‘అగ్ని నక్షత్ర’ హిందీ రీమేక్‌లో ధనుష్ ఇద్దరు హీరోల్లో ఒకడిగా నటిస్తున్నాడు. మణిరత్నం శిష్యుడైన బిజాయ్ నంబియార్ ‘అగ్ని నక్షత్రం’ విడుదలైన 28 ఏళ్లకు ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేసి హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్టు తీర్చిదిద్దాడట బిజాయ్. ముందు ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణె, నిక్కీ కౌషల్ హీరోలుగా నటిస్తారని అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నిక్కీ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రను ధనుష్‌తో చేయించబోతున్నారు. బహుషా ధనుష్ సినిమా ఒరిజినల్ వర్షన్‌లో కార్తీక్ చేసిన పాత్ర పోషించే అవకాశముంది. మరి ఈసారి ధనుష్ తనదైన ముద్రను ఎలా చూపిస్తాడో చూద్దాం.

Comments

comments