Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కొబ్బరినూనెతో మచ్చలు మాయం

Coconut-oil

వయస్సు రీత్యా వచ్చే మచ్చలు శరీర సౌందర్యాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. మచ్చలు అనేవి వయస్సురీత్యా వచ్చేవే కాకపో వచ్చు.కొన్ని సందర్భాలలో సూర్య రశ్మి కారణంగా కూడా మచ్చలు రావచ్చు. వీటిని పోగొట్టుకోవడానికి సౌందర్య సాధనాలు ఉపయోగిం చడం కన్నా కొబ్బరి నూనె ఉపయో గించడం ద్వారా వీటిని పూర్తిగా పోగొట్టుకొవచ్చు. టీనేజీ వయ స్సులో ఉన్నవారికి ఇవి వచ్చినా చాలాసార్లు వెంటనే పోతాయి. కానీ వయసు మళ్లినవారిలో మాత్రమే ఈ మచ్చలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అంటున్నారు. వీటిని పోగొట్టుకోవడానికి కొబ్బరినూనె మందుగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలో వివరాలు తెలుసుకుందాం.

ముందు మచ్చలు ఉన్న భాగాన్ని శుభ్రంగా సబ్బు లేదా ఏదైనా బాడీలోషన్ పెట్టి శుభ్రపరచుకోవాలి. అనంతరం తడి లేకుండా తుడుచుకోవాలి. అరచేతిలో టేబుల్ స్పూను కొబ్బరి నూనె తీసుకొని మచ్చలు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దడం చేయకూడదు. నూనె వలన చర్మం ఎర్రగా మారే అవకాశం వుంది. సూర్యరశ్మి కారణంగా మచ్చ లు ఏర్పడినా వెంటనే ఈ విధంగా చేయడం మంచిది. మచ్చలు కనిపించిన వెంటనే చేసినట్లయితే మంచి ఫలి తాన్ని పొందవచ్చు. స్నానా నికి ముందు కొబ్బరి నూనెను శరీరమంతా అప్లయ్ చేసి సున్నితంగా మర్దనా చేసుకొని అనంతరం గోరువెచ్చని నీటి తో స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని నెలల పాటు చేసినట్లయితే మచ్చలు పోయి చర్మం మరింత మెరుస్తూ ఉంటుంది.

Comments

comments