Home హైదరాబాద్ తల్లితో సహజీవనం… కూతురిపై అఘాయిత్యం

తల్లితో సహజీవనం… కూతురిపై అఘాయిత్యం

RAPED

మన తెలంగాణ/చార్మినార్ : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తిపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు ల కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రశాంతికి వివాహమై 14 ఏళ్ళ కూతురు, ఒక కుమారుడున్నాడు. అదే ప్రాంతానికి చెందిన జగదీప్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి 2017లో జగదీప్‌తో కలిసి విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి నగర శివారుల్లో ని జల్‌పల్లికి వచ్చి చాక్లెట్ కంపెనీలో పనిచేస్తుంది. కొద్ది రోజుల క్రితం జగదీప్ ప్రశాంతి కూతురైన 14 ఏళ్ళ కూ తురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా తల్లికి తెలపటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగదీప్ కోసం గాలిస్తున్నారు.