Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

దత్తాత్రేయ కుమారుడు మృతి

datanna

 గుండెపోటుతో హఠాన్మరణం 

 భోజనం చేస్తూ కిందపడ్డ వైష్ణవ్

మన తెలంగాణ /హైదరాబాద్ ముషీరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. మంగళవారంరాత్రిసుమారు 10:30 గంటల సమయంలో కుటుంబసభ్యులతో కలిసి రాంనగర్‌లోని తన స్వగృహంలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వైష్ణవ్ కిందపడిపోయాడు.దీంతో అతన్ని చికి త్స నిమిత్తం ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అర్థరాత్రి దాటాక 12ః30 గంటల సమయంలో వైష్ణవ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అసలే అనారోగ్యంతో ఉన్న దత్తాత్రేయకు ఉ.5 గం టల వరకు వైష్ణవ్ చనిపోయినట్లు చెప్పలేదు.తీరా విష యం తెలిశాక ఒక్కసారిగా దత్తాత్రేయ కుప్పకూలారు. 21 ఏళ్ల వయస్సులోనే గుండెపోటు వచ్చి మృతి చెందడం తో అందరూ షాక్ అయ్యారు.దీంతో దత్తాత్రేయ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.గంట ముందు వర కు తమతో కలిసి భోజనం చేస్తున్న తమ కుమారుడు అం త లోనే అనంతలోకాలకు వెళ్లడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. మృతుడు వైష్ణవ్ మెడిసిటీ మెడిక ల్ కాలేజీలో ఎంబిబిఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.
దత్తాత్రేయను పరామర్శించిన ప్రముఖులు
తన ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబం సభ్యులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న నాయకులు బుధవారం రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసానికి చేరుకుని ఆయ న్ను పరామర్శించారు. పరామర్శించినవారిలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఏపి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్.లక్ష్మణ్, మంత్రులు కడియం శ్రీ హరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రులు హరీష్‌రావు, లకా్ష్మరెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కె.కేశవరావు, ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఇతర ప్రముఖులు,ప్రజాప్రతినిధులు దత్తాత్రేయను పరామర్శించారు.వైష్ణవ్ అం త్యక్రియలు సైదాబాద్ దోబిఘాట్‌లోని శ్మశాన వాటికలో ముగిశాయి. రాంనగర్‌లోని తన నివాసం నుంచి అంతి మ యాత్ర ప్రారంభమై మధ్యాహ్నం దోబిఘాట్ కు చేరుకుంది.ఈ అంతిమ యాత్రకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌తోపాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Comments

comments