Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రేమ కోసం కన్నవారిని..కూతురు…?

Daughter gives Morphine to her Parents for Love Marriage in Tamilnadu

చెన్నై: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించని తల్లిదండ్రులను ఓ కూతురు ఏం చేసిందో తెలుసా? వారు తినే భోజనంలో మత్తుమందు కలిపిన యువతి ప్రియుడితో పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా ముక్కురుంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానికంగా ఉండే పిచ్చాండి, అంబిక దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కుమార్తె దివ్య ఇటీవలె డిగ్రీ పూర్తి చేసింది. గత కొంతకాలంగా దివ్య అదే ప్రాంతానికి చెందిన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న కుమార్ విక్రమ్‌రాజా అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు పెళ్లికి ససేమీరా అన్నారు.

అయితే, ఇటీవల కుమార్ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. ఇదే సరియైన అవకాశమని భావించిన ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం రాత్రి భోజన సమయంలో దివ్య తన పథకాన్ని అమలు చేసింది. కుటుంబ సభ్యులు తినే భోజనంలో మత్తుమందు కలిపేసింది. అది తిన్న ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు స్పృహ కోల్పోయారు. అదే రోజు రాత్రి దివ్య ప్రియుడు విక్రమ్‌రాజాను పెళ్లి చేసుకుంది. స్పృహలోకి వచ్చిన తల్లిదండ్రులు ఇంట్లోని బీరువాలో రూ. 20వేల నగదుతో పాటు 15 తులాల బంగారం కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కొత్త దంపతులు తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. కానీ నగదు, నగలు తాము తీసుకెళ్లలేదని చెప్పారు. వారిద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారిని వదిలేశారు.

Comments

comments