Home పెద్దపల్లి కోడలి వేధింపులు తాళలేక అత్త ఆత్మహత్య..

కోడలి వేధింపులు తాళలేక అత్త ఆత్మహత్య..

female-image

ముత్తారం:  ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన ఓ మహిళ కన్న కొడుకు, కోడలు వేధింపులు తాళ లేక  బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ షేక్ మస్తాన్  కథనం ప్రకారం… వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలి కొడుకు మధూకర్, కోడలు సువర్ణలు తరచూ వేధింపులకు గురిచేసే వారు. భూమి అమ్మి డబ్బులు చేతికి ఇవ్వాలని, భూమి పాసు పుస్తకం, ఎటిఎం కార్డు తీసుకొని తమ దగ్గర ఉంచుకున్నారు. ఆత్మహత్య చేసుకొమని నిత్యం సూటిపోటి మాటలతో వేధించడంతో మనస్థాపం చెందిన ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి తల్లి గొపగాని శాంతమ్మ పోలీసులకు  ఫిర్యాదు చేసింది. ఈ  మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.