Home తాజా వార్తలు ప్రియుడితో కలిసి చిన్నారి హత్య

ప్రియుడితో కలిసి చిన్నారి హత్య

Child-Killed

పోషణకు భారమైందని భావించి చనిపోయిన తన అక్క ఆరేళ్ళ కూతురుని ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చి, అనంతరం అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసి ఒక మహిళ పోలీసులకు దొరికిపోయిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం మౌలాలిలోని గాయత్రి నగర్‌లో నివాసముండే మన్నె కృష్ణ కుమారి(28) భర్తతో విడిపోయింది. కూలి పని చేసుకుంటూ తన తొమ్మిదేళ్ళ కుమారుడు, అమ్మతో కలిసి నివసిస్తోంది. తన అక్క లక్ష్మీ ప్రసన్న కూడా తన భర్త తో విడిపోయి వేరుగా ఉంటుంది. ఈమెకు జ్ఞానేశ్వరి (6) అనే కూతురు ఉంది. నాలుగు నెలల క్రితం లక్ష్మీ ప్రసన్న అనారోగ్యంతో చనిపోయిం ది. అప్పటి నుండి జ్ఞానేశ్వరి అమ్మమ్మ, చిన్నామ్మల వద్దనే ఉంటోంది. కృష్ణ కుమారికి కొత్త పేట్ నివాసి గౌరారం శివా రెడ్డి(29)తో సంబం ధం ఉంది. కుటుంబ పోషణను భారంగా భావించిన కృష్ణ కుమారి జ్ఞానేశ్వరిని కడతేర్చాలని భావించి తల్లి ఇంట్లో లేని సమయంలో ఈ నెల 22న శివారెడ్డితో కలిసి బాలికను హత్య చేసింది. బాలిక తలను గోడకేసి బలంగా బాదడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం
బాలిక మూర్ఛ వ్యాధితో చనిపోయిందని కృష్ణ కుమారి తన తల్లిని నమ్మించి, శివా రెడ్డితో కలిసి కుషాయిగూడలోని స్మశానవాటికలో ఈనెల 22న సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు వెళ్ళారు. స్థానికులకు అనుమానం వచ్చి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ భాస్కర్ సంఘటనాస్థలానికి వచ్చి వారిని వివరాలు అడిగాడు. వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన భాస్కర్ చిన్నారి మృతిపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు చిన్నారిది హత్య అని తేలడంతో కృష్ణ కుమారిని, శివా రెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Daughter Killed By Mother At Hyderabad