Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన తనయ!

Daughter killed Father with help of Boyfriend in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు తుక్కులూరులో దారుణం జరిగింది. మానవత్వం మరిచిపోయిన కూతురు ప్రేమించిన వాడితో కలిసి కన్న తండ్రినే అంతమొందించింది. వివరాల్లోకి వెళితే… స్థానికంగా నివాసం ఉండే శేషకుమారి అనే యువతి గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తండ్రికి తెలియడంతో మందలించాడు. దీంతో తండ్రిపై పగ పెంచుకున్న కుమార్తె  ప్రియుడితో చేతులు కలిపి తండ్రిని చంపించింది. మొదట  తనకేమి తెలియదని బుకాయించిందామె. అయితే, కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు శేషకుమారి కాల్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం నిందితులు శేషుకుమారి, ఆమె ప్రియుడు వేముల వెంకటేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments