Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తండ్రిని పొడిచిన కూతురు… ప్రియుడితో పరార్

తండ్రిని పొడిచిన కూతురు… ప్రియుడితో పరార్

murdered

 

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. తన కూతురు ప్రియుడితో కలిసి వెళ్లిపోతున్నప్పుడు తండ్రి అడ్డుకున్నాడు. దీంతో తన వద్ద ఉన్న కత్తితో తండ్రిని పొడిచి కూతురు పారిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వ్యాపారి కూతురు, స్థానికంగా ఉండే యువకుడు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారానికి అమ్మాయి తండ్రి నో చెప్పడంతో పారిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ జంట పారిపోతుండగా తండ్రి పట్టుకున్నాడు. దీంతో కూతురు తన వద్ద ఉన్న కత్తితో తండ్రిని పొడిచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన తండ్రిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రేమ జంట కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Daughter Stab to her Father in East Godawari

 

Daughter Stab to her Father in East Godawari