Home ఛాంపియన్స్ ట్రోఫీ వార్నర్ @ 4000

వార్నర్ @ 4000

David-warnerబెంగళూరు: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్‌లో నాలుగు వేల పరుగులను పూర్తి చేశాడు. బుధవారం కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వార్నర్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో 114 మ్యాచులు ఆడిన వార్నర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అంతేగాక, ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. వార్నర్ 40.94 సగటుతో దీన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు వార్నర్ మూడు సెంచరీలు, మరో 36 అర్ధ సెంచరీలు కొట్టాడు. కాగా, వార్నర్ కంటే ముందు సురేశ్ రైనా, కోహ్లి, రోహిత్ శర్మ, గౌతం గంభీర్‌లు మాత్రమే ఐపిఎల్‌లో నాలుగు వేల పరుగులను పూర్తి చేశారు.