Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

2 దావూద్

 ప్రపంచంలో రెండో సంపన్న నేరగాడిగా గుర్తింపు
 మొదటి వ్యక్తిగా డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్

Dawood-Ibrahim

న్యూఢిల్లీ: ముంబయి వరుస బాంబు కేసులో భారత్‌కు కా వలసిన నేరగాడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం క స్కర్ ప్రపంచ నేరస్తుల్లో రెండో స్థానంలో ఉన్న అత్యంత సంప న్నుడు. ప్రపంచ సంపన్న నేరస్తులలో కొలంబియా డ్రగ్ మా ఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ వివరాలను బ్రిటన్‌కు చెందిన పత్రిక ‘మిర్రర్’ పేర్కొంది. దావూద్‌కు 6.7 బిలియన్ డాలర్ల ఆస్తులున్నట్లు వెల్లడించిం ది. అంతేకాక దావూద్ ఆచూకీ చెప్పినవారికి 25 మిలియన్ డాలర్ల బహుమతి కూడా దక్కుతుందని అమెరికాకు చెందిన ‘ఫోర్బ్’ బిజినెస్ మ్యాగజైన్ తెలిపింది. ‘డిగ్యాంగ్’ పేరిట నడిచే దావూద్ నేరస్తుల ముఠా(క్రైమ్ సిండికేట్) చాలా శక్తి మంతమైన వ్యవస్థీకృత గ్యాంగ్. దావూద్‌కు ఐదు ఖండాలు, 16 దేశాలలో నేర సామ్రాజ్యం ఉంది. దావూద్‌కు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలున్నాయని భారత్ విశ్వసిస్తోంది. అండర్ వరల్డ్‌లో ‘డాన్’గా పేరుపొందిన డా వూద్ ఇబ్రహీం ఆస్తులను  బ్రిటన్ ప్రభుత్వం జప్తు చేసుకుం ది. దావూద్ మూడు అడ్రస్‌లతో ఉన్న ఆస్తులను జప్తు చేసు కుంది. భారత్‌లోని పైరసీ మార్కెట్‌లో  70 శాతం దావూద్ నియంత్రణలో ఉంది. బాలీవుడ్ సినీ నిర్మాతల నుంచి లక్ష లాది డాలర్లు వసూలు చేయడమేకాకుండా, వారికి ఫైనాన్స్ కూడా చేస్తుంటాడు. ఉగ్ర నిధులు సమకూర్చడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, నకిలీ కరెన్సీ అతడి ప్రధాన మనీ స్పిన్నింగ్ బిజినెస్ అని సమాచారం. దావూద్ అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్‌ను కూడా నడిపిస్తుంటాడు. ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో కూడా అతడు నిందితుడు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించి పెడుతుంటాడు. అమెరికా కోశా గార శాఖ 2013లో అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రక టించింది.

Comments

comments