Home తాజా వార్తలు 28న భారత్ బంద్: వామపక్షాలు

28న భారత్ బంద్: వామపక్షాలు

LEFT-PARTY2

అమరావతి: విజయవాడలో శనివారం వామపక్ష సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 28న భారత్ బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌కు అందరూ సహకరించాలని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులకు బంద్‌లో మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

నల్లకుబేరులపై కాకుండా మోడీ సాధారణ ప్రజలపై దాడి చేస్తున్నారని సిపిఎం నేత బాబూరావు  మండిపడ్డారు. డిసెంబర్ 31 వరకు నోట్ల మార్పిడికి అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుకు లేఖలు రాసిన వారు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.