Home కామారెడ్డి విద్యా వ్యవస్థ పటిష్టతకు కృషి : కడియం

విద్యా వ్యవస్థ పటిష్టతకు కృషి : కడియం

KADIYAM

కామారెడ్డి : రెండు వేల కోట్ల రూపాయలతో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి , విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా బాన్సువాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అంకితభావంతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. టిఆర్‌టి నిర్వహించి జూన్2వ తేదీ నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో కార్పొరేట్ విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

DCM Kadiyam Comments on Education System