Home తాజా వార్తలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ : కడియం

దివాలాకోరు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ : కడియం

DCM Kadiyam Srihari Comments on Congress Leaders

వరంగల్ : తాను టిఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ విడుదల చేసిన పాక్షిక మేనిఫెస్టోను చూసి మహాకూటమి నేతలు బెంబేలెత్తుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ పూర్తిస్థాయి మేనిఫెస్టోను చూస్తే ప్రతిపక్షాలు ఎన్నికల్లో కూడా పోటీ చేయవని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని, తాము అమలు చేసిన పథకాలే తమను గెలిపించి మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి పేరుతో ఓట్ల కోసం వస్తున్న ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

DCM Kadiyam Srihari Comments on Congress Leaders