Home తాజా వార్తలు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య : కడియం

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య : కడియం

DCM-KADIYAM

నిర్మల్ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.5.40కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విద్యా రంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 413 జూనియర్ కళాశాల్లో కేవలం 17 కళాశాలలకే పక్కా భవనాలు లేవని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

DCM Kadiyam Srihari Comments on Government Education