Home జయశంకర్ భూపాలపల్లి కెసిఆర్ ఒక్కరే బాహుబలి : కడియం

కెసిఆర్ ఒక్కరే బాహుబలి : కడియం

DCM Kadiyam Srihari Comments on Opposition Parties

జయశంకర్ భూపాలపల్లి : రాజకీయాల్లో ఒక్కరే బాహుబలి ఉంటారని, ఆ బాహుబలి టిఆర్‌ఎస్ చీఫ్, సిఎం కెసిఆర్ మాత్రమేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన రేగొండ టిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బిజెపి తనకున్న ప్రస్తుత సీట్లను గెలుచుకునే సత్తా లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌తో టిడిపి పొత్తుపెట్టుకుంటే ఎన్‌టిఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని, ఆ దుష్ట శక్తులను తరిమికొట్టాలని ఆయన టిఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వంద సీట్లలో గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DCM Kadiyam Srihari Comments on Opposition Parties