Home తాజా వార్తలు రైతుబంధు చెక్కులను పంపిణీ చేసిన కడియం

రైతుబంధు చెక్కులను పంపిణీ చేసిన కడియం

DCM Kadiyam Srihari Distributed the Rythu Bandhu Cheques to Farmers

వరంగల్ అర్బన్ : కాజీపేట మండలం సోమిడి గ్రామంలో శుక్రవారం అర్హులైన రైతులకు రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాలను తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడారు. రైతుబంధు పథకం కాంగ్రెస్, బిజెపి, టిడిపి నేతలకు భయం పుట్టిస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ నన్నపనేని నరేందర్, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కలెక్టర్ ఆమ్రపాలి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

DCM Kadiyam Srihari Distributed the Rythu Bandhu Cheques to Farmers