Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ ప్రదర్శన

Dilwale-dulhania-lejaayengeబాలీవుడ్ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ను సినిమా 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జపాన్‌లో ప్రదర్శించనున్నారు. షారుఖ్‌ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాతో షారుఖ్, కాజల్ జోడీ బెస్ట్ కాంబినేషన్‌గా నిలిచింది. యష్‌రాజ్ ఫిల్మ్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా జపాన్‌లోని ఒసాకా నేషనల్ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను జపనీస్ సబ్‌టైటిల్స్‌తో సినీ లవర్స్ కోసం ప్రదర్శించనుండడం విశేషం.

Comments

comments