Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

డివిలియర్స్ రిటైర్మెంట్

dvrs

మన తెలంగాణ/క్రీడా విభాగం : విధ్వంసక క్రికెటర్, దక్షిణాఫ్రికా స్టార్ ఎబి డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న డివిలియర్స్ బుధవారం సంచలన నిర్ణ యం తీసుకున్నాడు. తాను అం తర్జాతీయ క్రికెట్ నుంచి త ప్పుకుంటున్న వీడియో ద్వారా అభిమానుల కు తెలిపాడు. అయి తే దేశవాళీ క్రికెట్‌లో ఆడతానని డివిలియర్స్ పే ర్కొన్నాడు. కాగా, ఎబి తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యా ప్తంగా ఉన్న అతని అభిమానులు షాక్ కు గురయ్యారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే డివిలియర్స్‌కు ప్రపంచ వ్యా ప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగే డివిలియర్స్ ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కొంతకాలంగా డివిలియర్స్ ఫిట్‌నెస్ లేమితో బాధపడుతున్నాడు. తరచు గాయాల బారీన పడుతూ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతిని థ్యం వహించిన డివిలియర్స్ ఆశించిన స్థా యిలో ఆడలేక పోయాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్ అంతర్జాతీయ ప్రమాణాల కు సరితూగే విధంగా లేదని, అం దువల్లే రిటైర్మెంట్ ప్రకటించడమే ఉత్తమమని వీడియో సందేశం లో పేర్కొన్నాడు. అయితే ఐపిఎల్‌తో సహా ఇత ర టి20 లీగ్‌లలో డివిలియర్స్ ఆడే అ వకాశాలు న్నాయి.

ఎదురులేని శక్తిగా…
అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఎదురులేని శక్తిగా నిలిచిందంటే దానికి ఎబి.డివిలియర్స్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. టెస్టుల్లో, వన్డేల్లో డివిలియర్స్ అసాధారణ ప్రతిభను చూపాడు. అంతేగాక టి20లలో కూడా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. 2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు 114 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 278 (నాటౌట్). టెస్టుల్లో 22 శతకాలు, మరో 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు డబుల్ సెంచరీలు కూడా డివిలియర్స్ ఖాతాలో ఉన్నాయి. ఇక, 228 వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు. డివిలియర్స్ వన్డేల్లో 25 సెంచరీలు, మరో 53 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2005లో ఇంగ్లాండ్‌పై తొలి వన్డే ఆడిన డివిలియర్స్ తన చివరి వన్డేను ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో ఆడాడు. అంతేగాక తన చివరి టెస్టును 2018 మార్చిలో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇదిలావుండగా 2006లో ఆస్ట్రేలియాతో తొలి ట్వంటీ20 మ్యాచ్‌ను ఆడాడు. చివరి టి20 మ్యాచ్‌ను 2017లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. కాగా, 78 టి20 మ్యాచుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ 1672 పరుగులు చేశాడు. 135.17 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు సాధించాడు. ఇక, ఐపిఎల్‌లో 141 మ్యాచ్‌లు ఆడాడు. ఐపిఎల్‌లో తొలిసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తర్వాత బెంగళూరు తరపున చాలా కాలంగా ఆడుతున్నాడు. ఐపిఎల్‌లో డివిలియర్స్ మూడు శతకాలు సాధించాడు. ఇందులో 39.53 సగటుతో 3953 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 133 పరుగులు. కాగా, ఐపిఎల్‌లో డివిలియర్స్ సగటు 150.94 కావడం విశేషం.

రికార్డుల రారాజు…

1984లో జన్మించిన డివిలియర్స్‌కు చిన్నపటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. 2004లో తొలిసారి దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహిం చాడు. అప్పటి నుంచి మళ్లీ వెనుదిరిగి చూడలేదు. విధ్వంసక బ్యాటింగ్‌తో దక్షిణా ఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. వన్డే క్రికెట్‌లో ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యంత వేగంగా 50, 100, 150 పరుగుల రికార్డు డివిలి యర్స్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. అంతేగాక దక్షిణాఫ్రికా తరపున అత్యంత వేగంగా 50, 100 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఐపిఎల్‌లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ ఎన్నో చిరస్మరణీయ ఇన్నిం గ్స్‌లు ఆడాడు. ఐపిఎల్‌లో తన దైన ముద్ర వేశాడు.

అభిమానులకు షాక్..

dv

మిస్టర్ 360 డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించడం అభిమానులకు షాక్‌కు గురి చేసింది. ఇంకా కొన్నేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే సత్తా ఉన్నప్పటికీ డివిలియర్స్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు ఒక్క సారి విస్మయానికి గురయ్యారు. డివిలియర్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాకు డివిలియర్స్ సేవలు ఎంతో అవసరమని, రానున్న ప్రపంచకప్ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని వారు కోరుతున్నారు. ఎబి మాత్రం తన నిర్ణయం మార్చుకునేది లేదని స్పష్టం చేశాడు. తాను పూర్తిగా అలసి పోయానని, ఇకపై అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఓపిక తనకు లేదని పేర్కొన్నాడు. ఇదిలావుండగా డివిలియర్స్ నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత మాజీ స్టార్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ తదితరులు డివిలియర్స్ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని అభిప్రాయపడ్డారు. ఎబి నిర్ణయంతో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బలహీన పడడం ఖాయమని వీరు పేర్కొన్నారు.

ప్రస్థానం…

– జననం : ఫిబ్రవరి 17, 1984
-డిన టెస్టులు: 114
– శతకాలు 22,
– అర్ధ శతకాలు 46
– చేసిన పరుగులు 8765
– తొలి టెస్టు ఇంగ్లాండ్‌తో (2005లో)
– చివరి టెస్టు ఆస్ట్రేలియాతో (2018లో)
– ఆడిన వన్డేలు 228
– శతకాలు 25
-అర్ధ శతకాలు 53
– చేసిన పరుగులు 9577
– తొలి వన్డే ఇంగ్లాండ్‌తో (2006లో)
– చివరి వన్డే భారత్‌తో (2018లో).

Comments

comments