Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చెలరేగిన డివిలియర్స్.. పంజాబ్ టార్గెట్ 149

AB-Devillers

ఇండోర్ : ఐపిఎల్-10లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు ఎబి డివిలియర్స్ మరోసారి తనదైన ఆటతీరుతో చెలరేగిపోయాడు. గత రెండు మ్యాచ్‌ల్లో గాయం కారణంగా టీంకి దూరంగా ఉన్న డివిలియర్స్ మరోసారి తన ఆటతీరుతో జట్టును ఆదుకున్నడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్ లతో 86 పరుగులు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఆరు ఓవర్లలోనే వాట్సన్ 1, విష్ణు 7, జావద్ 1 స్వల్ప పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. అయితే డివిలియర్స్, మనిదీప్ కలిసి నిలకడగా ఆడి జట్టును మంచి స్కోర్ వైపు నడిపించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 149 పరుగుల లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగింది.

Comments

comments