Home ఆఫ్ బీట్ పుట్టే బిడ్డకు ‘కర్నాటక’ కాదు.. ‘తాజ్’ పేరు పెడతా!: డివిలియర్స్

పుట్టే బిడ్డకు ‘కర్నాటక’ కాదు.. ‘తాజ్’ పేరు పెడతా!: డివిలియర్స్

Taj-Mahal

న్యూఢిల్లీ: భారత్‌పై ఉన్న అభిమానం కొద్దీ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ తన కూతురుకు ‘ఇండియా’ అని పేరు పెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. భారత్‌ను ఎంతగానో ఇష్టపడే  దక్షిణాఫ్రికా మరో  క్రికెటర్ ఎబి డివిలియర్స్ తనకు బిడ్డ పుడితే ‘తాజ్’ అనే పేరుపెడతానని అంటున్నాడు.  ‘2012 ఐపీఎల్ జరిగే సమయంలో తాజ్‌మహల్ వద్దే డేనియల్లికి నేను ప్రపోజ్ చేశా. ఆ మరుసటి ఏడాది మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. 2015లో మాకు బాబు పుట్టాడు. అతని పేరు అబ్రహాం. మాకు తర్వాత పుట్టబోయే రెండో చిన్నారికి ‘కర్ణాటక’ అని పేరు పెట్టాలని ముందు అనుకున్నా. కానీ, నాకు తాజ్ అన్న పేరు బాగా నచ్చింది. అందుకే ఈ పేరే పెడతా’ అని బెంగళూరు ఆటగాడు డివిలియర్స్ చెప్పాడు.