Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సముద్రంలో 26 మంది యువతుల మృతదేహాలు

SEA

లిబియా : మధ్యదరా సముద్రంలో 26 మంది యువతుల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ఆ యువతుల మృతదేహాలను వెలికి తీశారు. ఈ యువతులు నైజర్, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులు కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. లిబియా నుంచి ఓడలో యూరప్ వెళుతుండగా ప్రమాదం జరిగి వీరు సముద్రంలో మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. లిబియాలో యువతుల అక్రమ రవాణా అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి యువతులను తీసుకొచ్చి వారిని సెక్స్ వర్కర్లుగా మారుస్తుంటారు. ఈ నరకం నుంచి తప్పించుకునేందుకు కొందరు యువతులు ఇటువంటి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుస్తోంది.

Dead bodies of 26 women in the sea

Comments

comments