Search
Friday 16 November 2018
  • :
  • :

ఇంటికి చేరిన మృతదేహాం…

dead-body-imageమన తెలంగాణ/సారంగాపూర్‌ః మండలంలోని తాండ్రి గ్రామానికి చెందిన సాజొద్దిన్(23) ఇటీవల దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. వారం తరువాత ఆయన మృతదేహాం ఇంటికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఈయన తండ్రి అల్లిసాబ్, ముగ్గురు కుమారులు అల్లిసాబ్ 10 సంవత్సరాల క్రితం పెద్ద కుమారుడు, ముడు సంవత్సరాల క్రితం మృతి చెందారు. రెండోవ కుమారుడైన సాజొద్దిన్ గత సంవత్సరం దుబాయ్ వెళ్లాడు. ఆయన నివాసం ఉంటున్న గదిలోనే గత గురువారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిసింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మండల నాయకుల విన్నపంతో మృతదేహాన్ని త్వరగా వచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఏయిర్‌పోర్ట్ నుండి ఇంటి వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి తల్లి రోధన పలువురిని కంటతడి పెట్టించింది.

Comments

comments