Home ఆదిలాబాద్ హైడ్రామా మధ్య మృతదేహం లభ్యం

హైడ్రామా మధ్య మృతదేహం లభ్యం

మూడింటిలో ఒక మృతదేహం వెలికితీత
మరో రెండు మృతదేహాలు శిథిలాల కిందే
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
క్షణమొక యుగంగా గడుపుతున్న కుటంబికులు

rescue-teamమనతెలంగాణ/బెల్లంపల్లి : శాంతిఖనిగనిలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగిన సమయం నుండి నేటి వరకు అనగా మూడు రోజుల పాటు అధికారులు, రెస్కూ సిబ్బంది చేసిన సాహాసోపేత మృతదేహా వెలికితీత చర్యలు ఫలించి శుక్రవారం 12 గంటల సమయాన హన్మంతరావు అనే కార్మికుని మృతదేహాన్ని వెలికి తీశారు. గత మూడు రోజుల నుండి అధికారులు, రెస్కూ సిబ్బంది ప్రమాదం స్థలం వద్దే ఉంటూ మృతదేహాల వెలికి తీత పనుల్లో నిమగ్నమై పని చేస్తున్నారు. మూడు రోజులుగా బాధిత కుటుంబ సభ్యులు క్షణమొకయుగంగా గడుపుతూ కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తూ వచ్చారు. ఓపిక నసించి కొంత మంది కుటుంబ సభ్యులు అధికారులను ఘోరావ్ చేయడంతో అధి కారులు ఉదయం, సాయంత్రం అంటూ శా ంతింప ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అధికారులు మృతదేహాల వెలికి తీత పనుల్లో కొంత వేగం పెంచి హన్మంత రావు అనే కార్మికుని మృత దేమాన్ని వెలికి తీయ గలిగారు. మరో రెండు మృత దేహా లను శుక్రవారం రాత్రి లేద శనివారం ఉద యం కళ్ల తీస్తామని అధికారులు తెలుపుతున్నారు. వ్యూహాత్మకంగా మృతదేహాన్ని తరలించారు. గత మూడు రోజుల క్రితం శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందిన హన్మంతరావు మృతదేహాన్ని శుక్ర వారం వెలికి తీసిన అనంతరం అధికారులు, పోలీ సులు మృతదేహాన్ని గని వెనుక ద్వారం ద్వారా తరలించారు. ఈ ప్రమాదం గూర్చి గత మూడు రోజులుగా కార్మిక కుటుంబాలు, తోపాటి కార్మికులు ఆందోళన చేస్తున్న విషయాన్ని పసిగట్టిన అధికారులు ఎలాంటి గొడవలకు తావి వ్వకుండా గని ముందు భాగం నుండి కాకుండా వెనుకాల నుండి తరలించి ఆందో ళనలను అడ్డుకట్ట వేయడంలో సఫలి కృతు లయ్యారని చెప్పవచ్చు.  మృతదేహాన్ని ఇలా తరలించడాన్ని కొన్ని సంఘాలు మౌనంగా ఉన్నప్పటికీ కొన్ని సంఘాల మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాయి.