Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో టోర్నడో బీభత్సం…

అమెరికాలో టోర్నడో బీభత్సం…

Tornado

బ్యూరీగార్డ్‌: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను తీవ్రతతో అనేక ఇళ్లు ధ్వంసం కాగా వందల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. టోర్నడో ధాటికి ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు  తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్నేయ అలబామాలో టోర్నడో ప్రభావం ఎక్కువగా ఉంది. ఇళ్లు కూలిపోవడంతో పలువురు గల్లంతయ్యారు. అత్యవసర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటివరకు 14 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్లు కూలి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

Deadly weather in Eastern US as tornadoes