Home తాజా వార్తలు అభిమానులంతా కామ్రేడ్సే : విజయ్ దేవరకొండ

అభిమానులంతా కామ్రేడ్సే : విజయ్ దేవరకొండ

Dear-Comradeవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “నాలుగు భాషల్లో ఈ ట్రైలర్ విడుదలైంది. అలాగే ఈనెల 26న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించబోతున్నాం.

ఈనెల 12న బెంగుళూర్‌లో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించనున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. ఇక మనం ఏ పని చేసినా, కష్టసుఖాల్లో మనకు తోడుగా ఉండే వ్యక్తులను, స్నేహితులను కామ్రేడ్ అంటాం. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆడియన్స్ ప్రేమ, అభిమానాలే. వాళ్లంతా కామ్రేడ్సే. అందుకే వారి కోసం మ్యూజిక్ సెలబ్రేషన్ నిర్వహించాలనుకుంటున్నాం. అందరూ ఫ్రీగా ఈ ఈవెంట్స్‌కు రావచ్చు. బెంగుళూర్‌లో జరిగే ఈవెంట్‌కు కన్నడ స్టార్ యశ్ అతిథిగా హాజరు కానున్నారు”అని అన్నారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ “ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో నేను లిల్లీ పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు భరత్ ఈ సినిమాతో బిజీ కావడమే కాదు పెద్ద దర్శకుడవుతాడు”అని తెలిపారు. చిత్ర దర్శకుడు భరత్ కమ్మ మాట్లాడుతూ “ఇదొక లాంగ్ జర్నీ. మూడేళ్లుగా దీనిపై వర్క్ చేస్తున్నాం. నాకు పూర్తి సపోర్ట్ చేసిన విజయ్‌కు థాంక్స్‌”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, యశ్ రంగినేని, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Dear Comrade Trailer Review