Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Death of a young man in road accident

భద్రాచలం: స్థానిక గోదావరి వంతెనపై బుధవారం సాయంత్రం  రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సారపాక ఐటిసి పిఎస్‌పిడి స్కూల్‌కు చెందిన బస్సును వంతెనపై నడుచుకుంటూ వస్తున్న యువకుడు మడకం పండును (18)ను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా వాసిగా గుర్తించారు. పరిసరా ప్రాంతాల్లో జమాయిల్ కర్ర నరికేందుకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments