Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

దర్శకురాలు బి.జయ మృతి

Death of Telugu director B. Jaya

దర్శకురాలు బి.జయ గురువారం రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాస గృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె పాత్రికేయురాలిగానూ రాణించారు. అనంతరం సినీ రంగ ప్రవేశం చేసి 2003లో తొలిసారి ‘చంటిగాడు’ అనే సినిమాకు దర్శకత్వం వహించి ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు. ఆతర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్‌లీ, వైశాఖం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమె చేసిన చివరి చిత్రం ‘వైశాఖం’ గత ఏడాది విడుదలైంది. భర్త బి.ఎ.రాజు నిర్మాతగా బి.జయ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమె స్వయంగా తన చిత్రాలకు తానే ఎడిటింగ్ చేసుకుంటారు. ఇక బి.జయ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజాగుట్టలోని స్మశాన వాటికలో నిర్వహించారు.

సినీ ప్రముఖుల నివాళి…
శ్రీనగర్ కాలనీలోని నివాస గృహంలో ఏర్పాటుచేసిన బి.జయ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, నమ్రత, వెంకటేష్, మంచు మనోజ్, సుధీర్‌బాబు, వంశీ పైడిపల్లి, సుకుమార్, పూరీ జగన్నాథ్, గుణశేఖర్, తేజ, మారుతి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, అనిల్ సుంకర, బెల్లంకొండ సురేష్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, నరేష్, ఆర్.నారాయణమూర్తి, శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి, ఛార్మి, జీవిత, నందినీ రెడ్డి, ఝాన్సీ, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చి రెడ్డి, ఆది, బాలాదిత్య తదితరులు ఆమె భౌతికకాయానికి పూలతో నివాళులర్పించారు.

Comments

comments