Home జాతీయ వార్తలు మైనర్లపై రేప్ లకు మరణశిక్ష

మైనర్లపై రేప్ లకు మరణశిక్ష

కీలక బిల్లుకు కేంద్రం ఆమోదం
త్వరలో ప్రవేశం

Old Man Raped Nine Year Old Girl in Guntur District

న్యూఢిల్లీ : పన్నెండు సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారానికి మరణశిక్షకు వీలు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును బుధవారం మొదలైన పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ కీలక బిల్లును ఆమోదించినట్లు న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ బుధవారం విలేకరులకు తెలిపారు.

దీనికి సంబంధించి హోం మంత్రిత్వశాఖ సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. బాలలపై అత్యాచారాల తక్షణ ఆటకట్టుకు ఎప్రిల్ 21న వెలువరించిన సంబంధిత క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంట్ ఆమోదం పొందితే ఈ క్రిమినల్ లా సవరణ బిల్లు (2018) అమలులోకి వస్తుంది. కథూవాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార తరువాత దారుణ హత్య , యుపిలోని ఉన్నావోలో మహిళపై అత్యాచారం తరువాత దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనల దరిమిలా ఈ బిల్లుకు చట్టరూపం తీసుకువస్తున్నారు. మైనర్ బాలికలపై అత్యాచారం ఘటనలలో మరణశిక్షతో పాటు కఠినాతికఠిన శిక్షలు విధించేందుకు ఈ బిల్లులో నిబంధనలను రూపొందించారు. 12 ఏండ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్షను, 16 ఏండ్ల లోపు బాలికలపై అత్యాచారాల ఘటనలలో కనిష్ట శిక్షను పది సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు పెంచారు.

దారుణ ఘటనలలో యావజ్జీవ ఖైదుకు కూడా వీలుంటుంది. మహిళలపై అత్యాచార ఘటనలో కఠిన కారాగార శిక్ష పరిమితిని ఇప్పుడున్న ఏడేళ్ల నుంచి పది సంవత్సరాలకు దారుణ ఘటనలలో యావజ్జీవ శిక్షకు పెంచేందుకు వీలు కల్పించారు. అత్యాచార కేసులపై దర్యాప్తులను రెండు నెలల పరిమితిలో పూర్తి చేయాలని నిర్ధేశించారు. ఆ తరువాత అప్పీళ్ల విచారణ పూర్తికి ఆరు నెలల పరిమితిని ఖరారు చేశారు. 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం అభియోగాలు ఎదుర్కొనే వ్యక్తులకు ముందస్తు బెయిల్ నిబంధనను ఎత్తివేయాలని కూడా బిల్లులో పేర్కొన్నారు. ఇక నిందితుడికి బెయిల్ ఇచ్చే విషయలో బాధితురాలి తరఫు వారికి , పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు న్యాయస్థానం కనీసం 15 రోజుల ముందు ఈ విషయంపై వారి వాదనలకు నోటీసులు ఇవ్వాలి.

ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ వర్శిటీ

ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాట కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి మండలి భేటీ తరువాత మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వచ్చే నెల ఐదవ తేదీ నుంచే ఈ విశ్వవిద్యాలయంలో విద్యా సంవత్సరం ప్రారంభం అ వుతుందని తెలిపారు. ఈ మేరకు సెంట్రల్ యూ నివర్శిటీస్ సవరణ బిల్లు 2018కు మంత్రి మం డలి ఆమోదం తెలిపిందని జవదేకర్ చెప్పారు. ఇక అక్టోబర్ నుంచి ప్రారంభం అయ్యే తదుపరి చక్కెర మార్కెటింగ్ సంవత్సరానికి చెరకు కనీస ధరను క్వింటాలుకు రూ 20 చొప్పున పెంచుతారు. ఈ మేరకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. దీనితో షుగర్ మిల్లుల వారు ఇకపై చెరకు ధరలను రైతులకు క్వింటాలుకు రూ 275గా చెల్లించాల్సి ఉంటుంది.