Home అంతర్జాతీయ వార్తలు బంగ్లా మాజీ మంత్రులకు మరణశిక్ష

బంగ్లా మాజీ మంత్రులకు మరణశిక్ష

int

ఢాకా: గ్రెేనేడ్ దాడి కేసులో బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్‌ఫోజ్మన్ బాబర్‌తో పాటు మరో 18 మందికి స్థానిక కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2004, ఆగస్టు 21న షేక్ హసీనాను టార్గెట్ చేస్తూ గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 24 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. దాడి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న షేక్ హసీనా.. బహిరంగ సభ కోసం వచ్చి ట్రక్కు నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. ఈ కేసులో బిఎన్‌పి పార్టీలో కార్యదర్శిగా చేసిన హరిస్ చౌదరీకి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌కు జీవిత ఖైదు శిక్షను విధించగా..మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూకు మరణశిక్షను ఖరారు చేశారు. మరో 11 మంది ప్రభుత్వ అధికారులకు కూడా శిక్ష ఖరారైంది.

Death penalty to Bangladesh former ministers

Telangana