Home తాజా వార్తలు ప్రజల కోసమే అప్పులు : ఈటల

ప్రజల కోసమే అప్పులు : ఈటల

ETALA

హైదరాబాద్ : ప్రజా సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నట్టు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం శాసనసభలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు మారుతున్నాయని, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు మారాలని ఆయన అన్నారు. అభివృద్ధి జరగకపోతే రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉంటాయని తెలిపారు. తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా అప్పులు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌బిఎమ్ పరిమితికి లోబడే అప్పులు ఇస్తారని ఆయన చెప్పారు. రెవెన్యూ ఖర్చులు తక్కువ చేసిన వారికే అప్పులు ఇస్తారన్నారు. జిడిపిలో 41.11 శాతం అప్పులు చేసిన దేశం భారత్ అని ఆయన చెప్పారు.

 Debts for the People : Etala