Home వార్తలు వీక్లీ రౌండప్ డిసెంబర్ ఫస్ట్ వీక్

వీక్లీ రౌండప్ డిసెంబర్ ఫస్ట్ వీక్

నవంబర్ 29
Current-Affairs*కర్బన ఉద్గారాలను తగ్గించుకోవ డా నికి చిన్న, పేద దేశాలు అవసరమైన నిధులు పొందడానికి వీలుగా వాతా వరణ మార్పులకు సంబంధించి ప్రత్యే కంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయ డానికి కామన్వెల్త్ దేశాలనేతలు అంగీకరించారు.
* బాక్సింగ్ క్రీడా చరిత్రలో గత 11 ఏళ్లుగా ఓటమి ఎరుగని యోధుడు వ్లాదిమిర్ క్లిచ్ కో (ఉక్రె యిన్)ను టైసన్ ఫ్యూరీ (బ్రిటన్) కంగు తినిపిం చాడు. డస్సెల్‌డోర్ఫ్‌లో జరిగిన పోరులో టైసన్ ఫ్యూరీ వ్లాదిమిర్‌ను మట్టి కరిపించాడు.
* పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది టీ20 అం ర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా దుబాయి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అఫ్రిది 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీనితో మొత్తం 86 టీ20 మ్యాచ్‌ల లో ఆడిన అఫ్రిది 86 వికెట్లు తీసి టీ20 ఫార్మా ట్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచాడు.
* అబుదాబి గ్రాండ్ ప్రీ ఎఫ్ వన్‌ను రోస్‌బర్గ్ (మెర్సిడెస్) గెలుచుకున్నారు.
* అడిలైడ్ వేదికగా న్యూజి లాండ్‌తో జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చరిత్రాత్మక విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధిం చింది. ఈ టెస్టులో తొలిసారిగా గులాబీ రంగు గల బంతిని ఉపయోగించారు.
* ప్రపంచ టీమ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ డేవిస్ కప్‌ను బ్రిటన్ గెల్చుకుంది. గెంట్ (బెల్జి యం)లో జరిగిన ఫైనల్‌లో బెల్జియంను ఓడించి, 77 ఏళ్ల తర్వాత ఈ కప్‌ను సాధించింది.
నవంబర్ 30
*దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్ రికార్డును బద్దలు కొట్టే స్థాయిలో సౌదీ అరేబియాలో జెడ్డా టవర్‌ను నిర్మించనున్నారు. కి.మీ. ఎత్తున 1.23 బిలియన్ డాలర్ల వ్యయం తో ఇది రూపు దిద్దుకోనుంది. జెడ్డా ఎకానిమిక్ కంపెనీ, అతిన్మా ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు ఇటీవల 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేశారు. వీటిల్లో జెడ్డా నగర అభివృద్ధితో పాటు, ఈభారీ నిర్మాణం కూడా ఉంది. ఈప్రాజెక్టు ఇప్ప టికే 26 అంతస్థుల నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది.
* తాజాగా ఐసిసి ప్రకటించిన అత్యుత్తమ టెస్ట్ బౌల ర్ల జాబితాలో అశ్విన్ రెండవ స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ కొనసాగుతున్నాడు. టెస్ట్ బ్యాట్స్‌మన్‌ల ర్యాంకిం గ్ లలో ఆస్ట్రేలియన్ కెప్టెన్ స్టీవెన్‌స్మిత్, ఇంగ్లండ్ క్రీడాకారుడు జోరూట్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
డిసెంబర్ 1
* ఐఎంఎఫ్ రిజర్వ్ కరెన్సీలోకి చైనా యువాన్ చేరింది. 2016 అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీంతో అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా చైనాను సంస్థ గుర్తించింది. ఎస్‌డీఆర్‌గా పేర్కొనే ఈ వ్యవస్థలో అమెరికా డాలర్, యూరో, బ్రిటీష్ పౌండ్, జపాన్ యెన్‌లకు మాత్రమే ఇందులో చోటు ఉండేది.
* వర్ధమాన దేశాల్లో వాతావరణ మార్పులను ఎదు ర్కొనేందుకు 100 బిలియన్ డాల ర్లను అందజేసిన ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లోని ఆరు ఇతర సంస్థలు ప్రపంచ వ్యాప్త అభివృద్ధ్ది, పర్యావ రణ పరిరక్షణకు గణనీయంగా సాయం అందిం చగలమని ముందుకు వచ్చాయి. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న కాప్ -21 సద స్సులో ఆరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయం వెల్లడిం చాయి.
* జకోవిచ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో నిలిచాడు. బ్రిటన్‌కు చెంది న ఆండీముర్రే రెండవ స్థానంలో నిలిచాడు. 3వ ర్యాంక్‌లో ఫెదరర్ నిలిచాడు.
* అంతర్జాతీయ సౌర కూటమిని ఫ్రాన్స్, భారత్‌లు పారిస్ లో కాప్ 2015 సందర్భంగా ప్రారంభించాయి. ఈకూ టమికి భూమి, సచివాలయం కోసం భారత్ తరఫున 30 మిలియన్ డాలర్ల సాయాన్ని మోడీ ప్రకటించారు.
డిసెంబర్ 2
* ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జాన్‌జుకెర్ బర్గ్, ఆయన సహచరి వారం రోజు ల క్రితం జన్మించిన తమ కూతు రు మ్యాక్స్‌కు రాసిన బహిరంగ లేఖలో తమ ఆస్తిలోని 99 శాతాన్ని (99 శాతం షేర్లు) సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ షేర్ల విలువ దాదాపు 2.94 లక్షలకోట్ల రూపాయలు. చాన్ జుకర్‌బర్గ్ ఇనీటిఏటివ్ అనే సంస్థ ద్వారా ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.
డిసెంబర్ 4
* విద్యుత్‌ను నిల్వను చేసే సరికొత్త పేపర్‌ను స్వీడిష్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు పవర్ పేపర్.
* ఐఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు బ్రిటన్ సిరియాలో బాంబు దాడులను ప్రారంభించింది.
* ప్రఖ్యాతిగాంచిన రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సారధిగా భారత సంత తికి చెందిన వైద్యురాలు విజయ్. ఎం.రావు నియ మితులయ్యారు.

నవంబర్ 29
* ప్రధాని మోడీ ఏక్ భారత్- శ్రేష్ట్ భారత్ పథకం తన రేడియో కార్యక్రమం మన్‌కి బాత్‌లో ప్రకటించారు. దేశంలో సమైక్యత ఎప్పటికీ కొనసాగుతుందని పేర్కొం టూ అక్టోబరు 31న సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా తాను ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ గురించి ప్రస్తావించానని, ఇప్పుడు ఈ నినాదానికి సంబంధిం చిన పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు మైగవర్నమెంట్ డాట్ కామ్‌లో వారి అభిప్రా యాలను తెలియజేయాలని కోరారు. ఈ వెబ్‌సైట్ నిర్మాణం, లోగో పనితీరుపై సూచనలు చేయాలని కోరారు.
* ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తరహాలో కోల్ కతాలో ఒక నిర్మాణాన్ని చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోల్ కతా శాటిలైట్ సిటీలోని ఎకో పార్కు వద్ద దీన్ని నిర్మిస్తున్నారు. దీని ఎత్తు 55 మీటర్లు కాగా, 300 టన్నుల ఉక్కును దీని కోసం ఉపయోగించనున్నారు. దీనిపైకి ఎక్కడానికి రెండు భారీ లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
* అండర్-19 ముక్కోణపు సీరీస్‌లో యువ భారత్ సిరీస్ సాధించింది. కోలకతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 36.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్ప కూలింది. 13.3 ఓవర్లలోనే 117 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది.
* తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు మకావు ఓపె న్ బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్స్ పోరులో విజయం సాధిం చింది. జపాన్‌కు చెందిన క్రీడాకారిణి మిథానీపై విజయాన్ని సాధించింది.
డిసెంబర్ 1
* సమాచార, కమ్యూనికేషన్ పరిజ్ఞానం (ఐసీటీ) స్థాయిని గణించే ప్రపంచ సూచీలో 167 దేశా లకుగాను భారత్ 131 స్థానంలో నిలిచింది. ద.కొ రియా, డెన్మార్క్, ఐస్‌లాండ్‌లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.
* బుల్లితెరపై తన నటనా ప్రతిభతో భారతదేశ ప్రజలకు సుపరిచితుడైన అ నూప్ సింగ్ బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ మీట్‌లో పసిడి పతకాన్ని సాధించాడు.
డిసెంబర్ 2
* నెలరోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాం తమైన పుదుచ్చేరిలు తల్లడిల్లిపోతున్నాయి. వం దే ళ్లలో ఎన్నడూ లేనంత కుంభ వృష్టితో చెన్నై సహా తమిళనాడులోని అనేక కోస్తాజిల్లాలు అతలా కుతలమయ్యాయి.
* భారీ వర్షాలతో నీట మునిగిన చెన్నైలో సహాయక చర్యల కోసం విశాఖ నుంచి చెన్నైకు ఐఎస్‌ఎస్ ఐరావత్ బయలుదేరింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ ప్రింట్ ఎడిషన్ ప్రచురణ నిలిచి పోయింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీగా కురుస్తున్న వర్షాలతో చెన్నైతో పాటు తిరువ ళ్లూర్, కాంచీపురం, కడలూర్ జిల్లాలు అతలాకుతల మయ్యాయి. ఇప్పటి వరకు 188 మంది ప్రాణాలు కోల్పోయారు.
డిసెంబర్ 3
* ప్రధాని నరేంద్ర మోడీ వరదల వల్ల దెబ్బ తిన్న తమిళనాడుకు రూ.1000 కోట్ల తక్షణ సహాయక ప్యాకేజీ ప్రకటించారు. ఇది గత వారం ప్రకటించిన రూ.940 కోట్ల ప్యాకేజీ కు అదనం.
* భారత్‌లో మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో 36 శాతం మార్కెట్ షేర్‌ను దక్కించుకుని శామ్‌సంగ్ మొదటి స్థానం దక్కించుకుంది. మైక్రోమ్యాక్స్ 22.5 శాతం వాటాతో రెండవ స్థానం క్కించుకుంది.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)గా టిఎస్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. సర్వోన్నత న్యా యస్థానం 43వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీక రించారు.
డిసెంబర్ 4
* ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు వాహనాల సరి, బేసి సంఖ్యల ఆధారంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రిజిస్ర్టేషన్ నెంబర్ చివరి సంఖ్య సరి, బేసి ఆధారంగా రోడ్లపై తిరిగేందుకు అనుమతించనున్నారు. సరిసంఖ్య కలిగిన వాహనా లకు ఒకరోజు, బేసి సంఖ్య కలిగిన వాహనాలకు మరో రోజు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
* జీఎస్‌టీ రేటును 17-18 శాతంగా నిర్ణయించాలని అరవింద్ సుబ్రమణియన్ సంఘం సిఫార్సు చేసింది. 1 శాతం ప్రతిపాదిత పన్నును విడిచి పెట్టా లని సూచించింది. కనిష్ట జీఎస్‌టీ 12 శాతం, గరిష్ట జీఎస్‌టీ 40 శాతంగా ఉండవచ్చని తెలిపింది.
* ప్రముఖ కమ్యూనిస్టు నేత బనీ దేశ్ పాండే మరణిం చారు. యూనివర్స్ ఆఫ్ వేదాంత, కమ్యూనిస్టు మూవ్ మెంట్-ఇండియన్ నేషనల్ కాంగ్రె స్ తదితర పుస్తకాలు ఆయన రచించారు.
* మూడు మాసాలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఉదయ్ మార్గదర్శకాల్లో పేర్కొంది.
* ప్రస్తుత ఆర్థిక సం.లో జీడీపీ వృద్ధి 7.4 శాతం ఉంటుం దని ఏడీబీ, ఎస్ అండ్ పీ అంచనా వేశాయి. వచ్చే ఏడాది 7.8 శాతం ఉంటుందని తెలిపాయి.
* భార్య ఆరోగ్య పరిరక్షణ భర్త ప్రాథమిక బాధ్యత అని సుప్రీంకోర్టు వెల్లడించింది.
* భారత బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వ ర్యంలోనిఐబీఎల్ పేరును ఇక నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌గా వ్యవహరిస్తారు.
* ఫోన్‌కాల్స్‌పై భదత్రా సంస్థల నిఘాకు ఏర్పాటవు తున్న కేంద్రీకృత పర్యవేక్షణ సంస్థ (సీఎంఎస్) వచ్చే ఏడాది మార్చి నుంచి విధులను నిర్వహిస్తుంది.
* చెట్టినాడ్ గ్రూప్ వ్యవస్థాపకులు రామస్వామి మరణించారు.

నవంబర్ 29
* డిఫెన్స్ అండ్ ఏరో సప్లయ్ ఇండియా -2015 ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కీన్స్ ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు.
నవంబర్ 30
* రూ. 500 కోట్లతో 50 ఎకరాల్లో ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమను అమెరికాకు చెందిన అడ్వా న్స్‌డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ (ఏవోడీ) కంపెనీతో కలిసి భారత్‌కు చెందిన సిస్కో కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
* కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో స్మార్ట్ మాన్యుఫాక్చ రింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ సెంటర్‌ను రక్షణ రంగ ఉత్పత్తులు, దిగుమతులకు అవసరమయ్యే ఉపకరణాల ఉత్పత్తు లకు సంబంధించి మొదటగా అభివృద్ది చేస్తారు.
డిసెంబర్ 1
* 61వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని రజ్ నంద్‌గావ్ లో జరిగిన స్పీడ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర స్పీడ్‌బాట్ అండర్-19 బాలుర జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది.
* రూసా నిధుల్లో తెలంగాణ వాటాను కేంద్ర ప్రభు త్వం 40 శాతంగా నిర్ణయించింది.
* మహబూబ్‌నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ శ్రీదేవి తెలిపారు.
డిసెంబర్ 2
* దేశంలోని పట్టణాలలో మౌలిక వస తులు మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథ కంలో భాగంగా తెలంగాణాకు రూ.40.85, ఏపీకి రూ.60.08 కోట్లను కేంద్ర పట్టణాభివ ృద్ధి మంత్రిత్వశాఖ నిధులను మంజూరు చేసింది.
డిసెంబర్ 4
* తెలంగాణా రాష్ట్రంలో రహదారుల అభివృద్ది, నిర్వ హణ తదితరాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నది.
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని మిషన్ భగీరథ పథకంగా మార్చారు.
* తెలంగాణలో ఇంజక్షన్ రూపంలో పోలియో టీకా అందుబాటులోకి వచ్చింది. దీనిని శాంతా బయో టెక్నిక్స్ రూపొందించింది.
* క్షయకు వ్యతిరేకంగా పోరాడే ఆర్‌వీ 1988 ప్రోటీన్‌ను గుర్తించినట్లు సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నసిస్ తెలిపింది.
* తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రిట్జ్ సీఎన్‌ఎన్‌ఐబీఎన్ అవార్డు అయిన మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ లభించింది.
* కరీంనగర్‌ను గుడుంబా రహిత జిల్లాగా ఆ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రకటించారు.
* కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ డయల్ 112 పథకంలో పైలట్ ప్రాజెక్గు తెలంగాణ పోలీస్‌శాఖ ఎంపికైంది. తొలి దశలో గుజరాత్, తెలంగాణల్లో ఈ ప్రాజె క్టును అమలు చేయాలని నిర్ణయించారు.
* తెలంగాణలోని జీనోమ్‌వ్యాలీలో నైపర్ (జాతీయ ఔషధ విద్యాపరిశోధన సంస్థ)ను ఏర్పాటు చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.