Search
Friday 21 September 2018
  • :
  • :

బిఇడి అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు

central
హైదరాబాద్: బిఇడి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సెకెండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జిటి) పోస్టులకు బిఇడి అభ్యర్తులను అర్హులుగా ప్రకటించింది. ఈ మెరకు కేంద్ర ప్రభుత్వం 2010 నాటి గెజిట్‌ను సవరిస్తూ మంగళవారం కొత్త గెజిట్‌ను విడుదల చేసింది. అయితే బిఇడి చేసిన వాళ్లు ఎస్జిటిలుగా నయమితులైతే రెండు సంవత్సరాలలోపు 6 నెలల ఎలిమెంటరీ ఎడ్యూకేషన్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని షరతు విధించింది. కాగా, ఇప్పటి వరకు ఎస్జిటిలుగా డిఇడి చేసిన వారికి మాత్రం అర్హత ఉండేది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బిఇడి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments