Search
Friday 20 July 2018
  • :
  • :
Latest News

దోమల నివారణతో వ్యాధులకు చెక్

Decrease diseases with the prevention of mosquitoes

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : దోమల ద్వారా వ్యాప్తి చెందే వివిధ రకాలైన వ్యాధులను సమూలంగా నియంత్రించడానికి అందరూ సమిష్టిగా కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీసమావేశ మందిరంలో మలేరియా నియంత్రణ, నివారణ మాసం సందర్భంగా వైద్య ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పంచాయతీ రాజ్, మెప్మా తదితర అనుబంధ శాఖల అధికారులతో డిస్ట్రిక్ టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్సాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు న్నాయన్నారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాదులు వర్షాకాలంలో విజృంభించకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మలేరియా తదితర వ్యాదులు ప్రభల కుండా వైద్యారోగ్యం, అనుబంధ శాఖలు చర్చించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా, ప్రతి గ్రామంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడి వర్కర్ల ద్వారా సీజనల్ వ్యాదుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తల గురించి ప్రజలకు చెప్పాలని తెలిపారు.

దోమల ద్వారా అనాఫిలిస్, క్యూలెక్స్, ఎడిన్, మాన్సోనియా, ఆర్మిజరిన్ వ్యాధులు వ్యాపిస్తాయని, ముఖ్యంగా అపరిశుభ్రత, కలుషిత నీటిని వాడకుండా, ఇంటి చుట్టుప్రక్కల నిలువ ఉండకుండా చూడాలన్నారు. అందుకు సాయంత్ర అవగానే దోమల నియంత్రణకు కిటీకీలు, డోర్లు, దోమ తెరలతో పాటు మురుగు కాల్వలలో కిరోసిన్ చల్లడం, స్ప్రేలు వంటివి వాడాలన్నారు.  ప్రతి గ్రామంలో పాఠశాల విద్యార్థులతో బ్యానర్లు, చార్టుల ద్వారా దోమల నివారణ, నియంత్రణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించాలని, మలేరియా నియంత్రణ, నివారణ అంశంపై చార్ట్, వ్యాసరచన, వక్తత్వ పోటీలను నిర్వహించాలని డీఈవోకు సూచించారు. సంచార వైద్యబృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, అదే విధంగా కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచార మాద్యమాలు, కళాజాత కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహంలో హెల్త్ కమిటీ టీంలను ఏర్పాటు చేసి దోమల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా అధికారులకు ఆమె సూచించారు.  ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎం. రాథోడ్, డా. గాయిత్రిదేవి, డీసీహెచ్‌ఎస్ మురహరి, వైద్యులు రాజేశ్వరి, శశాంక్, డెమో ప్రసాద్, జిల్లా విస్తరణ అధికారి సీత గుండయ్య,  జిల్లా సంక్షేమాధికారులు, జెడ్పీ డిప్యూటీ ఈఈవో రుక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments