Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జనవరిలో స్వల్పంగా తగ్గిన జిఎస్‌టి వసూళ్లు

gst

న్యూఢిల్లీ: జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వసూళ్లు నెలనెలా తగ్గుముఖం పడుతున్నాయి. జనవరి నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ.86,318 కోట్లు నమోదయ్యాయి. డిసెంబర్‌లో వసూళ్లు రూ.86,703 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2017లో చివరి నెలలో జిఎస్‌టి వసూళ్లు పెరిగాయి. అయితే డిసెంబర్‌లో రూ.86,703 కోట్లు వసూళ్లతో పోలిస్తే జనవరిలో రూ.385 కోట్లు తగ్గాయి. అక్టోబర్ తర్వాత జిఎస్‌టి కౌన్సిల్ దాదాపు 200 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. జిఎస్‌టిలో ఫిబ్రవరి 25 వరకు 1.03 కోట్ల మంది రిజిస్టర్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిలో 17.65 లక్షల మంది కాంపోజిషన్ డీలర్లు  ఉండగా.. వీరు మాత్రమే మూడునెలకు ఒక సారి పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారు ప్రతినెలా  పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయాలి. జనవరి నుంచి ఫిబ్రవరి 25 వరకు జిఎస్‌టిఆర్ 3బి రిటర్న్‌లను 57.78 లక్షల మందికి పైగా దాఖలు చేశారు. మొత్తంలో 69 శాతం మంది నెల నెలా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జనవరిలో వసూళు అయిన రూ.86,318 కోట్లలో.. సిజిఎస్‌టిగా రూ.14,233 కోట్లు, ఎస్‌జిఎస్‌టిగా రూ.19,961 కోట్లు, ఐజిఎస్‌టిగా రూ.43,794 కోట్లు వసూలు అయ్యాయి.

Comments

comments